Telangana School Holidays September:  తెలంగాణలోని విద్యాసంస్థలకు వారాంతంలో మరోసారి వరుస సెలవులు వచ్చాయి. సెప్టెంబరు 14న రెండో శనివారం కాగా, సెప్టెంబరు 15న ఆదివారం, సెప్టెంబరు 16న సోమవారం మిలాద్-ఉన్-నబీ సెలవులు వచ్చాయి. ఇక సెప్టెంబరు 17న మంగళవారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబరు 17న జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవుదినంగా ప్రకటించారు. అయితే ఆరోజు సెలవు ఇస్తుండటంతో నవంబరు 9న రెండో శనివారం పనిదినం(వర్కింగ్‌డే)గా ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు నెలలో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సెప్టెంబర్ నెలలో ఇప్పటికే విద్యాసంస్థలకు  చాలా సెలవులు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో కొన్ని రోజులు సెలవులు ఇచ్చారు. అదేవిధంగా వినాయక చవితి, పండగల నేపథ్యంలో సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ నెలలో ఇంకా ఉన్న సెలవుల వివరాలు చూస్తే.. 22 ఆదివారం సెలవు. అదేవిధంగా సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు ఉంది. సెప్టెంబర్ 29న ఆదివారం వస్తోంది.. కాబట్టి ఆరోజు కూడా అందరికీ సెలవురోజే. ఈ నెలలో వరుస సెలవులు వస్తుండటంతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి తోడు పండగలు కూడా రావడంతో తమ తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. 

ఈ విద్యాసంవత్సరం సెలవులు ఇలా..

➥ విద్యాశాఖ ప్రకటించింన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు 13 రోజుల పాటు ఉండనున్నాయి. ➥ సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 17 వరకు మొత్తం 5 రోజులు ఉంటాయి. ➥డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మస్ సెల‌వులు ఇవ్వనున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు ఇలా..ప్రభుత్వ కార్యాలయాలకు అక్టోబ‌ర్ 10న ద‌స‌రా, అక్టోబ‌ర్ 31న దీపావ‌ళికి సెల‌వులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..