UIDAI has once again provided free Aadhaar card update facility : మీ ఆధార్ కార్డు తీసుకుని  పదేళ్లు అయితే ఇప్పటి వరకూ అందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోతే అప్ డేట్ చేసకోవాల్సిందే. పదేళ్లకోసారి ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాలన్న రూల్ ఉంది. అందుకే.. ఆధార్ సెంటర్లలో ఇప్పుడు ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆధార్  కార్డును ఉచితంగా అప్ డేట్ చేస్తారు. దగ్గర్లోని ఆధార్  సెంటర్ కు వెళ్తే సరిపోతుంది. 


ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత అనేక మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అందులో ఉన్న అడ్రస్. ఎప్పటికప్పుడు ఇళ్లు మారిపోయే వారికి అడ్రస్ చేంజ్ అనేది  చాలా ముఖ్యం. అయితే చాలా మంది మార్పు చేసుకోరు. దీంతో ఆధార్  డేటా బేస్ లో పర్ ఫెక్ట్ సమచారం ఉండటం లేదు. అందుకే పదేళ్లకోసారి అప్ డేట్ చేసుకోవాలన్న నిబంధనల పెట్టారు. ఇప్పటికే చాలా కాలంగా ఉచిత ఆధార్ అప్ డేట్ సౌకర్యాన్ని కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి పెంచారు. డిసెంబర్ 14 వ తేదీ వరకూ ఆధార్ సేవా కేంద్రాల్లో ఉచితంగా ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం రూ. యాభై ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.   



అయితే ఆన్ లైన్ లోనూ సులువుగా ఆధార్ అప్ డేట్ చేసుకోవ్చచు. యూఐడీఏఐ వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్ తో లాగిన్ అయితే వివరాలన్నీ వస్తాయి. వాటిలో ఉన్న విరాల్ని  మార్పు చేయాలనుకుంటే ఎడిట్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేస్తే..  ప్రాసెస్ చేస్తారు.   





 ఆధార్ కార్డు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఎలాంటి సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడద. చివరి నాలుగు నెంబర్లు మాత్రమే ఎవరికైనా చూపించాల్సి ఉంటుంది. దుర్వినియోగం కాకుండా ఫేస్ ఐడెంటిఫికేషన్ ను కూడా తెచ్చేందుకు ఉడాయ్ సిద్దమయింది.