Heeraben Modi Death: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. తొలుత గుజరాత్ గాంధీనగర్‌లోని ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. మాతృమూర్తి పాడెను మోదీ మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ తల్లి పార్థివదేహం వద్ద కూర్చొని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో హీరాబెన్ అంత్యక్రియలు జరిగాయి. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
చికిత్స పొందుతూ
మోదీ తల్లి హీరాబెన్ (100) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
మాతృమూర్తి మరణంతో ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే దిల్లీ నుంచి గుజరాత్ చేరుకుని ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మరోవైపు ఈరోజు తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నట్లు సమాచారం.
ఎమోషనల్
తన మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూతపై ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు.
హీరాబెన్ మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
Also Read: PM Modi Mother Death: అమ్మ ప్రేమకు దూరమైన ప్రధాని మోదీ, ఈరోజు ఉదయమే హీరాబెన్ మృతి