Telangana Latest News Today on 9 September 2024 | అనర్హత పిటిషన్లపై నెల రోజుల్లో తేల్చండి - తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు ఆదేశం
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచారని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకొని స్టేటస్ రిపోర్టు తెలియజేయాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే తామే సుమోటోగా నిర్ణయం తీసుకుంటామని కూడా తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ నేతలు స్వాగతించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణలో ఉపఎన్నికలు వస్తున్నాయ్!-హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ రియాక్షన్ ఇదే
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు తీర్పును బీఆర్‌ఎస్ స్వాగతించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు కీలక కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే..." ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'ఆ బోట్లు వైసీపీ నేతలవే' - ప్రకాశం బ్యారేజీ ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారుల నివేదిక
ఇటీవల ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని తెలిపారు. డ్యాంను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవేనని నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునే వారని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రకాశం బ్యారేజ్ మరో 20 ఏళ్లే పని చేస్తుంది- ఏబీపీ దేశంతో కన్నయ్య సంచలన కామెంట్స్
దాదాపు పదకొండున్నర లక్షల క్యూసెక్కుల వరకు వచ్చిన వరద ఉద్ధృతిని తట్టుకున్న ప్రకాశం బ్యారేజ్ ఉండేది మరో 20 సంవత్సరాలేనా? త్వరలోనే మరో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేయక తప్పదా అంటే అవుననే అంటున్నారు రిటైర్డు ఇంజనీర్ ప్రముఖ జలవనరుల సాంకేతిక సలహాదారు కన్నయ్య నాయుడు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వాటి పనితీరుకు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్‌లో దేశవ్యాప్తంగా పేరుపొందారు ఇంజనీర్ కన్నయ్య నాయుడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హైదరాబాద్ పర్యటనలో మిజోరం గవర్నర్‌కు అస్వస్థత - గ్రీన్ ఛానల్ ఏర్పాటుతో ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్ పర్యటనలో ఉన్న మిజోరం గవర్నర్ హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను అధికారులు ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలి స్టార్ ఆస్పత్రికి తరలించారు. గవర్నర్‌ను తరలించేందుకు ఎమర్జెన్సీగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Also Read: Guntur News: కాటేసిన పాము కోసం 2 గంటలు వెతికాడు - చివరకు వెంటాడిన మృత్యువు, గుంటూరు జిల్లాలో ఘటన