Harsh Goenka: "వర్క్ ఫ్రమ్ హోం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో" ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? అయ్యో ఎందుకు ఆలోచించలేదు.. 'కరోనా పుణ్యమా' అని 'వర్క్ ఫ్రమ్ హోం'లో ఉన్నప్పుడు దీని గురించే ఎక్కువ మంది ఆలోచించారు. ఇంట్లో కూర్చొని పని చేస్తే పెట్రోల్ ఛార్జీలు కలిసొస్తాయని, ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని.. ఇలా 'బడ్జెట్ పద్మనాభం'లా చాలా మంది చాలానే ఆలోచించారు.
అయితే తాజాగా కరోనా శాంతించడంతో మళ్లీ ఆఫీసులు తెరుస్తున్నారు. ఉద్యోగులను రావాలని కంపెనీలు పిలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో 'వర్క్ ఫ్రమ్ ఆఫీసు' వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? అంటూ ఓ వ్యాపారవేత్త ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ సంగతి
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా అప్పుడప్పుడూ ఆసక్తికర విషయాలు ట్వీట్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఇంటి నుంచి కంటే ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వెల్లడించారు. ఇందులో ఆయన ఇచ్చిన వివరణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఆ పోస్ట్‌లో మొదటి పై ఛార్ట్ 'వర్క్ ఫ్రమ్ హోం'కు సంబంధించింది. అది మొత్తం పనితోనే నిండిపోయింది. రెండోది 'వర్క్ ఫ్రమ్ ఆఫీస్' అని గీసిన ఛార్ట్‌లో చాలా విషయాలకు అవకాశం ఉంటుందని వివరించారు.
"కాఫీ, లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు, ట్రాఫిక్‌లో కొద్దిసేపు వేచి ఉండొచ్చు, ఇంకొద్దిసేపు మన పనిచేసుకొని, మన తోటివారికి సహకరించొచ్చు" అని ఆ ఛార్ట్‌లో పేర్కొన్నారు.
గోయెంకా ఈ ట్వీట్ చేస్తూ ఓ క్యాప్షన్ పెట్టారు. "మీరు ఆఫీస్ నుంచే పనిచేయాలనేందుకు కారణమిదే" అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది 'వర్క్ ఫ్రమ్ హోం' ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. మరి కొంతమంది 'వర్క్ ఫ్రమ్ ఆఫీస్'కు జై కొడుతున్నారు.
రీసెంట్‌గా
హర్ష్ గోయెంకా రీసెంట్‌గా పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గురించి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. అందులో టాటా.. తనను ఎక్కువగా ఉత్తేజ పరిచే విషయం గురించి చెప్పారు.
" అందరూ "ఆ పని ఎప్పటికీ కాదు.. మీరు చెయ్యలేరు" అన్న పనిని సాధించడంలో ఓ కిక్ ఉంది. అదే నాకు ప్రేరణనిస్తుంది. అదే నన్ను ఉత్తేజపరుస్తుంది. "
Also Read: Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్- పోటీ నుంచి డిగ్గీ ఔట్
Also Read: RBI Repo Rate Hike: సామాన్యుడిపై వడ్డీల పిడుగు- మరోసారి రెపో రేటు పెంపు!