Amazon India Layoff:
లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌లు..
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ట్విటర్ సంచలనం సృష్టించగా...అమెజాన్ కూడా అదే బాట పట్టింది. సీనియర్ పొజిషన్‌లో ఉన్న వారినీ ఇంటికి పంపుతోంది. ఏళ్ల పాటు కంపెనీలోనే సేవలందించిన వాళ్లకూ పింక్ స్లిప్ చూపించి వెళ్లిపొమ్మంటోంది. ఇండియాలో కనీసం 1000 మందిని తొలగించాలని టార్గెట్‌గా పెట్టుకుంది అమెజాన్. అందులో భాగంగానే వరుసగా కొందరిని సాగనంపుతోంది. ఇలా ఉద్యోగం కోల్పోయిన వాళ్లంతా లింక్డ్‌ఇన్‌లో పెడుతున్న పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. #amazonlayoffs కూడా ట్రెండ్ అవుతోంది. కొంత మంది ఎమోషనల్ నోట్ కూడా పెడుతున్నారు. ఇటీవలే గుడ్‌గావ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓం ప్రకాశ్ శర్మ అనే ఉద్యోగిని జనవరి 11న తొలగించింది అమెజాన్. ఐదేళ్ల పాటు సీనియర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా పని చేసిన ఆ ఉద్యోగి తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ఉద్యోగం కావాలని, హెల్ప్ చేయాలని పోస్ట్ పెట్టాడు. నాన్న చనిపోయిన కొద్ది రోజులకే ఉద్యోగం పోగొట్టుకోవడం బాధగా ఉందని ఎమోషనల్ అయ్యాడు.
ఎమోషనల్ నోట్..
"2022 నా జీవితంలో అత్యంత ఛాలెంజిగ్ ఫేజ్. దాదాపు 2, 3 నెలల పాటు ఐసీయూలో మృత్యువుతో పోరాడి చివరకు నాన్న చనిపోయారు. దాదాపు నాలుగు నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు లేఆఫ్‌ల కారణంగా జనవరి 11న నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు" అని లింక్డ్ ఇన్‌లో పోస్ట్ పెట్టాడు. అమెజాన్‌లో ఐదేళ్ల పాటు పని చేయడం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా పాజిటివ్‌గా ఉండాలని మోటివేట్ కూడా చేశాడు. ఓం ప్రకాశ్ మాత్రమే కాదు. ఇలా ఉద్యోగం కోల్పోయి లింక్డ్ ఇన్ వేదికగా పోస్ట్‌లు పెడుతున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. బెంగళూరు అమెజాన్‌లో పని చేస్తున్న హర్ష అనే యువకుడూ ఇదే విధంగా లేఆఫ్‌కి గురయ్యాడు. "2023 ఇలా స్టార్ట్ అవుతుందని ఊహించలేదు. లేఆఫ్‌ల్లో భాగంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు" అంటూ పోస్ట్ పెట్టాడు.
వేలాది మంది..
వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం...గతేడాది నవంబర్ నుంచి ఈ కోతలు కొనసాగుతున్నాయి. అయితే...మరో 10 వేల మందిని తొలగించనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ...ఇప్పుడా సంఖ్య ఏకంగా 18 వేలకు పెరిగింది. సంస్థ దీనిపై
ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా...కచ్చితంగా ఇంత మందని తొలగిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలోని సియాటెల్‌లోని కంపెనీలో దాదాపు 10 వేల మందిని తొలగించేందుకు ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకుంది అమెజాన్. రిటెయిల్, హెచ్‌ఆర్ విభాగంలోని ఉద్యోగులను ఇంటికి పంపనుంది. కొవిడ్ సంక్షోభ సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగింది. అప్పుడు వేలాది మంది ఉద్యోగులను అదనంగా రిక్రూట్ చేసుకుంది కంపెనీ. అయితే...ఇప్పుడు బిజినెస్ డల్ అవడం వల్ల వారి అవసరం లేదని భావిస్తోంది. అందుకే....క్రమంగా వారిని తొలగిస్తూ వస్తోంది.
Also Read: Rajamouli on James Cameron: RRRను రెండుసార్లు చూసిన కామెరూన్ - రాజమౌళితో ఆయన ఏమన్నారో తెలుసా?