Gujarat Spy Arrest: 


గుజరాత్‌లో గూఢచారి..


గుజరాత్‌కి చెందిన ఓ వ్యక్తి ఇండియన్ ఆర్మీకి చెందిన కీలక వివరాలను పాకిస్థాన్‌కి అందిస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసింది. ఆనంద్ జిల్లాలోని తపూర్‌ టౌన్‌కి చెందిన వ్యక్తి ఆర్మీకి చెందిన చాలా సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కి చేరవేస్తున్నట్టు గుర్తించారు. భారత్‌కి చెందిన వ్యక్తే అయినప్పటికీ..పాకిస్థాన్ పౌరసత్వం పొందాడు. Pakistani intelligence operative (PIO) అందించిన సమాచారం ప్రకారం యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అప్రమత్తమైంది. 55 ఏళ్ల లాభ్‌శంకర్ మహేశ్వరి (Labshankar Maheshwari) వాట్సాప్ ద్వారా ఆర్మీలోని కొంత మందితో చాట్ చేశాడు. Remote Access Trojan (RAT) పంపుతూ సెన్సిటివ్ ఇన్‌ఫర్మేషన్‌ అంతా సేకరించాడు. ఇండియన్ సిమ్‌ కార్డుతో మెసేజ్‌లు పంపాడు. ఆ సిమ్ కార్డ్‌ కూడా వేరే వ్యక్తి పేరుతో ఉంది. పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి చెందిన ఓ వ్యక్తి ఓ డివైజ్‌ని లబ్‌శంకర్ మహేశ్వరికి అందించాడు. పాకిస్థాన్ పౌరుడైన లబ్‌శంకర్‌ మహేశ్వరి 1999లో భారత్‌కి వచ్చాడు. ఇక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. అయినా పాకిస్థాన్‌లో సంబంధాలు కొనసాగించాడు. ప్రస్తుతం నిందితుడు ఉపయోగిస్తున్న వాట్సాప్ నంబర్ పాకిస్థాన్‌లో యాక్టివ్‌గానే ఉంది. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌ నుంచి మాట్లాడుతున్నట్టుగా బురిడీ కొట్టించి ఆర్మీ సిబ్బంది కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడు. ఫలానా పోటీల్లో పాల్గొనాలని చెబుతూ కొన్ని మెసేజ్‌లు పంపాడు. జాతీయ జెండాల ఫొటోలు అప్‌లోడ్ చేయాలని అడిగేవాడు. ఇండియన్ డిఫెన్స్‌ సిబ్బంది కుటుంబ సభ్యుల కాంటాక్ట్‌ డిటెయిల్స్‌ని పాకిస్థానీ ఏజెన్సీకి పంపించాడు. ఈ క్రమంలోనే నిఘా వర్గాలు గుర్తించి అరెస్ట్ చేశాయి. 


కెనడా వివాదంలో పాకిస్థాన్..?


భారత్, కెనడా మధ్య వివాదం ముదురుతున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అల్లర్ల వెనక పాకిస్థాన్ హస్తం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నిఘా వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. కెనడాలో పాకిస్థాన్‌కి చెందిన ISIతో పాటు ఆ దేశ నిఘా వర్గం కూడా ఉందని...ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నాయని సమాచారం. ఓ చోట రహస్యంగా ఖలిస్థాన్ టెర్రర్ గ్రూప్‌ల చీఫ్‌లతో భేటీ అయినట్టు తెలుస్తోంది. Sikhs for Justice (SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నన్ కూడా ఈ మీటింగ్‌కి హాజరయ్యారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు మరి కొందరు కీలక నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే...5 రోజుల క్రితమే ఈ రహస్య సమావేశం జరిగింది. ISI ఏజెంట్స్, ఖలిస్థాన్‌ గ్రూప్‌ల భేటీ అజెండా కూడా తెలిసింది. వీలైనంత వరకూ భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారట. దీనికే Plan-K అని పేరు కూడా పెట్టుకున్నట్టు సమాచారం. ఇంకా కీలక విషయం ఏంటంటే..కెనడాలోని ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థలకు పెద్ద ఎత్తున ఫండ్స్ ఇస్తోంది ISI.కొద్ది నెలలుగా భారీగానే నిధులు అందినట్టు సమాచారం. 


Also Read: India Canada Tensions: ఇండియన్స్‌కి వెంటనే వీసాలు ఇవ్వలేం, కెనడా కీలక ప్రకటన