Gujarat News:


గుజరాత్ హైకోర్టులో పిటిషన్ 


గుజరాత్‌ హైకోర్టులో ఓ వింత పిటిషన్ దాఖలైంది. తనను కాదని గర్ల్‌ఫ్రెండ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమెను కస్టడీలోకి తీసుకోవాలంటూ పిటిషన్ వేశాడో యువకుడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆ యువకుడికి జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. గర్ల్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకోవాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. అంతే కాదు. అక్రమంగా ఆ యువతిని ఆమె భర్త అదుపులో ఉంచుకున్నాడని ఆరోపించాడు. వెంటనే అతడి నుంచి ఆమెను రక్షించి కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులకే సూచించాడు. గుజరాత్ ప్రభుత్వం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ యువకుడికి ఏం మాట్లాడాలో తెలియడం లేదని మండి పడింది. ఆ యువతి భర్తతో పాటు కలిసి ఉండటాన్ని ఇల్లీగల్ అనలేమని తేల్చి చెప్పింది. అయితే...ఆ యువకుడు మాత్రం కోర్టులో వాదిస్తున్నాడు. తన అంగీకారం లేకుండా ఆమె పెళ్లి చేసుకుందని చెబుతున్నాడు. అంతే కాదు. భర్త నుంచి విడిపోయి తనతో లివిన్ రిలేషన్‌లో ఉందని,తనతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుందని చెప్పాడు. అయితే కోర్టు మాత్రం ఈ అగ్రిమెంట్ ఆధారంగా ఆ యువతిని అదుపులోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. భర్తతో ఆమె ఉండడాన్ని చట్ట పరంగా సమర్థిస్తున్నట్టు తెలిపింది. ఇలాంటి పిటిషన్‌ వేసినందుకు ఆ యువకుడిని మందలించిన కోర్టు..రూ.5 వేల జరిమానా కూడా విధించింది. 


మరో వింత కేసు..


ఈ రోజుల్లో అబ్బాయిల పెళ్లంటే పెద్ద ప్రహసనం అయిపోయింది. లక్షల రూపాయల జీతమున్నా, సెటిల్ అయినా అమ్మాయిలు దొరకడమే కష్టమైపోతోంది. 30 ఏళ్లు దాటినా చాలా మంది బ్రహ్మచారులుగానే ఉంటున్నారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కథ వేరు. ఒక్క పెళ్లే కష్టం అనుకుంటుంటే...గ్వాలియర్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు ఏకంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అక్కడి నుంచి మొదలయ్యాయి తంటాలు. చివరకు కోర్టు వరకూ వెళ్లింది ఈ పెళ్లిగోల. ఈ సమస్యను ఎలా దాటాలిరా బాబు అని తల పట్టుకుంటున్న యువకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చింది కోర్టు. ఒక్కో భార్య దగ్గర మూడేసి రోజులు ఉండొచ్చని తీర్పునిచ్చింది. పైగా మరో బోనస్‌ కూడా ఇచ్చింది. ఆదివారం రోజు ఎవరిదగ్గరైనా ఉండొచ్చని చెప్పింది. అంటే వారంలో సగం రోజులు ఒక భార్య వద్ద, మరో సగం రోజులు మరో భార్య వద్ద ఉండొచ్చన్నమాట. ఆ యువకుడికి ముందుజాగ్రత్త ఎక్కువ అనుకుంటా. ఆల్‌రెడీ రెండు ఫ్లాట్‌లు కొనేసి రెడీ చేసేశాడు. ప్రస్తుతానికి ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇదేం తీర్పురా బాబు అని నవ్వుకుంటున్నారు నెటిజన్లు. ఫ్యామిలీ కౌన్సిలర్‌ కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నించాడు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకోవడం నేరం అని వివరించాడు. ఓసారి FIR నమోదైతే కెరీర్ కూడా పాడవుతుందని చెప్పాడు. ఇక ఇది కోర్టులో తేలే వ్యవహారం కాదని బయటకు వచ్చేశారు. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాడు ఆ కౌన్సిలర్. మూడు రోజులు ఒకరి దగ్గర, మరో మూడు రోజులు మరో భార్య దగ్గర ఉండాలని ఒప్పందం కుదిర్చాడు.


Also Read: Work From Home Ends: ఇంటి నుంచి పని చేసింది చాలు, ఇక ఆఫీస్‌లకు వచ్చేయండి - పలు కంపెనీల ఆదేశాలు