ఓవైపు హిజాబ్‌పై నిరసనలు జరుగుతోన్న వేళ గుజరాత్ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. పాఠశాల సిలబస్‌లో భగవద్గీతను ఓ సబ్జెక్ట్‌గా చేర్చారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6-12వ తరగతి విద్యార్థులకు తమ సిలబస్‌లో భగవద్గీతను చేర్చినట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది.
అందరికీ
విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులు ప్రకటించే సమయంలో అసెంబ్లీలో విద్యాశాఖమంత్రి జితు వాఘనీ ఈ మేరకు ప్రకటించారు. భగవద్గీతలోని విలువలు, బోధనలను పిల్లలకు నేర్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల తీసుకువచ్చిన కొత్త జాతీయ విద్యా పాలసీ (ఎన్‌ఈపీ)లో భాగంగా భారత వైవిధ్యమైన చరిత్రను పిల్లలు తెలుసుకోవాలన్నారు. వివిధ మతాలకు చెందిన వారు కూడా ప్రాచీన హిందూ గ్రంథమైన భగవద్గీత బోధించిన నీతి, విలువలను అంగీకరిస్తారన్నారు.
పోటీలు
కేవలం తరగతిలో బోధించడం మాత్రమే కాకుండా భగవద్గీతపై ప్రేయర్, శ్లోకాల పఠనం, వ్యాసరచన పోటీలు, డ్రామా, క్విజ్, పెయింటింగ్ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పుస్తకాలతో పాటు ఆడియో, వీడియో సీడీలను కూడా ప్రభుత్వం.. పాఠశాలలకు ఇవ్వనుందని తెలిపారు.
Also Read: ISKCON Temple Attack: ఇస్కాన్ మందిరంపై 200 మంది దాడి- ధ్వంసం చేసి లూటీ