Elevator Collapses in Ahmedabad: గుజరాత్ అహ్మదాబాద్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న యాస్పయిర్-2 భవంతిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ కుప్పకూలి ఏడుగురు కూలీలు మృతి చెందారు.
ఏడో అంతస్తు నుంచి
గుజరాత్ యూనివర్శిటీకి సమీపంలో ఈ భవన నిర్మాణం సాగుతోంది. ఏడో అంతస్తు నుంచి ఈ లిఫ్ట్ ఒకేసారి కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి.
ఈ ఘటన తెల్లవారుజామున జరిగినప్పటికీ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో పోలీసులకు బిల్డర్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. లిఫ్ట్ కుప్పకూలిన సమయంలో అందులో ఎనిమిది మంది కార్మికులు ఉన్నట్టు చెబుతున్నారు.
ప్రధాని సంతాపం
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Also Read: Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం- భయంతో ప్రయాణికులు పరుగు!
Also Read: Queen Elizabeth II Funeral: క్వీన్ ఎలిజబెత్- 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము