Government Websites Hacked:
50 సైట్‌లకు టార్గెట్..
కేవలం ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలనే కాదు. ప్రభుత్వ సైట్‌లనూ టార్గెట్ చేసుకుంటున్నారు హ్యాకర్లు. 2022 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 50 ప్రభుత్వ సైట్‌లు హ్యాక్‌కు గురయ్యాయి. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. 2020లో 59,2021లో 42,2022లో 50 గవర్నమెంట్ సైటలపై హ్యాకర్లు దాడి చేసినట్టు ఆయన వివరించారు. అదే సమయంలో 2022లో 3 లక్షల స్కామ్‌లను ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేసినట్టు చెప్పారు. CERT-In వివరాల ప్రకారం..2020 నుంచి అప్పటి వరకూ లక్షలాది స్కామ్‌లు జరిగే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమైనట్టు తెలిపారు. హిడెన్ సర్వర్‌లతో తమ ఐడెంటిటీని హైడ్ చేసి దాడులకు పాల్పడుతున్నారు హ్యాకర్లు. ఇండియన్ సైబర్ స్పేస్‌పై తరచూ దాడులు జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. దేశంలోనే కాకుండా...ఇతర దేశాలకు చెందిన హ్యాకర్లూ ప్రభుత్వసైట్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. Indian Computer Emergency Response Team (CERT-In) కొంత మేర వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హ్యాకింగ్ జరిగిన వెంటనే ఈ సంస్థ అధికారులను అలెర్ట్ చేస్తుంది. ఏయేం చర్యలు తీసుకోవాలో సూచనలు చేస్తుంది. అయితే... కేంద్రం చెబుతున్న లెక్కలకు వాస్తవంగా జరుగుతున్న దాడులకు పొంతన లేదన్న వాదన వినిపిస్తోంది. సోషల్ మీడియా అకౌంట్‌లు, ఈ మెయిల్స్ కూడా హ్యాక్‌కు గురయ్యాయి. 2022 ఏప్రిల్‌లో 641 ప్రభుత్వ ట్విటర్ అకౌంట్‌లను హ్యాక్ చేశారు. ఇటీవలే ఢిల్లీలోని AIIMS సర్వర్ కూడా హ్యాక్‌కు గురైంది.
ఎయిమ్స్ ఢిల్లీ సర్వర్ హ్యాక్..
వెంటనే సైబర్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై డ్యామేజ్‌ను కొంత వరకూ తగ్గించగలిగారు. అయితే...ఇది ఎవరు చేశారన్నది మాత్రం ఇంత వరకూ ఎలాంటి సమాచారం అందలేదు. దీనిపై...కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ABP Newsకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావించారు. "ఈ హ్యాకింగ్‌ను చిన్న విషయంలా తీసుకోకూడదు. దీని వెనకాల కచ్చితంగా కుట్ర ఉండే ఉంటుంది" అని అన్నారు. సీఈఆర్‌టీతో పాటు ఎన్‌ఐఏ, పోలీసులు కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారని చెప్పారు. ఇలాంటి దాడులు పదే పదే జరగకుండా...ప్రజల వ్యక్తిగత సమాచారం ఎవరి చేతుల్లోకీ వెళ్లకుండా కేంద్రం Digital Data Protection Billను తీసుకొస్తున్నట్టు వివరించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెడతామని అన్నారు. ప్రతి పౌరుడి వ్యక్తిగత ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఈ బిల్ రక్షిస్తుందని వివరించారు. ఎయిమ్స్ సర్వర్ హ్యాక్‌కు గురైన వెంటనే రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నత స్థాయి అధికారులతో మీటింగ్ పెట్టారు. సర్వర్‌ను రీస్టోర్ చేసి..పనులు సవ్యంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన ట్విటర్ హ్యాండిల్ కూడా హ్యాక్‌కు గురైంది. ఉన్నట్టుండి అకౌంట్‌లో అనుమానాస్పద ట్వీట్‌లు కనిపించాయి. క్రిప్టో వ్యాలెట్ Sui Walletని ప్రమోట్ చేస్తూ వరుసగా పోస్ట్‌లు వచ్చాయి. ఉదయం 5.38 గంటలకు ఈ ట్వీట్ కనిపించింది. అంతేకాదు. ఆ అకౌంట్ డీపీ త్రివర్ణ పతాకం ఉండగా...దాన్నీ మార్చేశారు హ్యాకర్లు. జెండా స్థానంలో... Sui Wallet లోగోను సెట్ చేశారు. కవర్ పేజ్‌నూ మార్చేశారు. ఈ పోస్ట్‌తో పాటు మరెన్నో గుర్తు తెలియని అకౌంట్‌లను ట్యాగ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు...అకౌంట్‌ను రికవరీ చేశారు.
Also Read: Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!