Gorakhpur News: ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఓ 70 వృద్ధుడు తన కోడలినే పెళ్లి చేసున్నాడు. అతని భార్యతోపాటు తన కుమారుడు కూడా చనిపోవడం... 28 ఏళ్ల వితంతువు అయిన కోడలికి తాళి కట్టి ఏడడుగులు వేశాడు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 


అసలేం జరిగిందంటే..?


గోరఖ్‌పూర్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. నెట్టింట వైరల్ అవుతున్న ఆ వార్త.. అందుకు సంబంధించిన ఫొటోలు చూసిన ప్రజలు నిజంగా ఇలా కూడా జరుగుతుందా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని ఛపియా ఉమ్రావ్ గ్రామంలో 70 ఏళ్ల వ్యక్తి తన 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు. ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న కైలాష్ యాదవ్ కు నలుగురు కుమారులు. అయితే 12 సంవత్సరాల క్రితమే అతని భార్య చనిపోయింది. అయితే కుమారులందరికీ పెళ్లి చేసిన కైలాష్ వారితోనే కలిసి జీవనం సాగించాడు. అయితే కొన్నేళ్ల క్రితం అతని మూడో కొడుకు చనిపోయాడు. 


ఈ తర్వాత కైలాష్ మూడో కోడలు.. రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేక తిరిగి మామగారింటికి వచ్చేసింది. తాను అక్కడకు వెళ్లనని.. ఇక్కడే ఉంటానని చెప్పింది. అంతేకాకుండా మామను పెళ్లి చేసుకోవడం తనకిష్టమని అనడంతో... కైలాష్ తన మూడో కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వారితో సహా ఇంకెవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో వీరి ఫొటోలు వైరల్ కావడంతో అందరికీ తెలిసిపోయింది. 


20 రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే


మొదటి భార్య బతికే ఉంది. భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ కాసేపటికే మొదటి భార్య అక్కడకు చేరుకోవడంతో.. సీనంతా రివర్స్ అయిపోయింది. పెళ్లి చేసుకున్న గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమె జీవితం నాశనం కాకూడదని పెద్దలు చెప్పడంతో తన సొంత తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. 


అసలేం జరిగిందంటే..?


ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ జిల్లా సైద్ నగరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే భార్యతో గొడవల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు మరో గ్రామానికి చెందిన ఓ యువతితోవివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించాడు. ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పి అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. కానీ అదే సమయంలో మొదటి భార్య అక్కడకు చేరుకుంది. పెళ్లి మండపం వద్దనే గొడవకు దిగింది. తాను బతికుండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటావని ప్రశ్నించింది. దీంతో వరుడు భయపడిపోయాడు. అక్కడున్న పెద్దలు కూడా పోలీసులకు విషయం తెలిస్తే కేసు అవుతుందని భావించి.. సమస్యను అక్కడే సద్దుమణుగేలా చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టారు. అందులో తీసుకున్న నిర్ణయం మేరకు.. ఆ వ్యక్తి రెండో భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ఆమె జీవితం పాడు కాకూడదనే ఉద్దేశ్యంతో తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి జరిపించారు. ఇలా ఈ కథ సుఖాంతమైంది.