Gidugu Rudraraju Resign to PCC Chief Post: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా (Gidugu Rudraraju) చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు గిడుగు రుద్రరాజు అందజేశారు. దీంతో వైఎస్ షర్మిల (YS Sharmila) ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ జోడో న్యాయ యాత్రలో ఆదివారం (జనవరి 14) మణిపూర్‌లో పాల్గొన్న వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవిపై ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఏఐసీపీ ఆదేశం మేరకే ఏపీ పీసీసీ చీఫ్ గా గిడుగు రుద్రరాజు తప్పుకున్నట్లు తెలుస్తోంది.
గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) అమలాపురానికి చెందిన వారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, కేవీపీ రామచంద్రరావుకి సన్నిహితంగా ఉండేవారు. 2005 నుంచి 2007 వరకు వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా ఉండేవారు. 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ లో కొనసాగారు. 2012లో ఈయనకు కాంగ్రెస్ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడిగా బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.