Garikapati Narasimhara Rao:  ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు చిక్కుల్లో పడ్డారు.  ఆయన  మంచి వ్యక్తి కాదని దూషిస్తూ కామేశ్వరి అనే మహిళ  సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది.  ఆమె తాను గరికపాటి మొదటి  భార్యనని..తనను బలవంతంగా తెచ్చి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత గెంటేశాడని ఆరోపిస్తున్నారు. ఆమె చేసిన ఆరోపణల ఆధారంగా గరికపాటిపై సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. 


ప్రవచన కర్తగా గరికపాటికి గుర్తింపు  


సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం  చేశారు.  అవధానిగా  గరికపాటి నరసింహారావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతని వ్యక్తిగత జీవితంలో  ఇలాంటి వివాదాలు ఉన్నాయని ఇప్పటి వరకూ తెలియదు. గరికపాటి  నరసింహారావు తిన్నతనంలోనే తనను లాకొచ్చి మెడలో దండ వేసి  పెళ్ళి చేసుకున్నాడని కామేశ్వరి అనే మహిళ చెప్పుకుంది.  మొదట్లో ఉద్యోగం లేదు.. డబ్బు లేదు.  ఉన్న ఇంటిని తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకుని రాయించుకున్నాడని ఆరోపించారు.  పిల్లల  భవిష్యత్తు గురించి అలోచించి తానే బయటకు వచ్చేశానని ఆ తర్వాత వేరే పెళ్లి చేసుకున్నాడన్నారు. నా పిల్లలను మంచిగానే పెంచాడు. పెళ్లి చేశాడని చెప్పుకొచ్చారు. 


అన్యాయంపై పోరాడాలని గరికపాటి వీడియోలో చెప్పారు.. అందుకే స్పందిస్తున్నా..


ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఇలా ఆరోపణలు చేస్తే డబ్బు కోసం అనుకుంటారని కానీ తాను డబ్బు కోసం ఆరోపణలు చేయడం లేదని కామేశ్వరి చెబుతున్నారు.   మీకు అన్యాయం జరిగితే మాట్లాడాలి.. ఎదిరించాలి అని చెబుతున్నాడని అది విన్నాక నాకు కూడా అనిపించిందని..తనకు  అన్యాయం జరిగింది కదా అని అందుకే ఇప్పుడు బయటకు వచ్చానని కామేశ్వరి చెబుతున్నారు. కామేశ్వరి వీడియోల ఆధారంగా గరికపాటిపై పలు రకాల వీడియోలను వైరల్ చేస్తున్నారు.  ఆయన ప్రవచనాల్లో భాగంగా చెప్పిన కొన్ని మాటల్ని కట్ చేసి క్షమాపణలు వేడుకుంటున్నారన్నట్లుగా వీడియోలు విడుదల చేస్తున్నారు. 


Also Read :  తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం


చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న గరికపాటి 


ఈ ప్రచారంపై గరికపాటి నరసిహంరావు సిబ్బంది స్పందించారు.  కొందరు వ్యక్తులు, కొన్ని యుట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేసి పరువు తీస్తున్నారు. ఈ దుష్ప్రచారం, వారి కుటుంబ సభ్యులను, అభిమానులను చాలా కలత పెడుతోందని ..  వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, సత్య దూరం అని స్పష్టం చేశారు. అలాగే కొన్ని వేర్వేరు సంఘటనల్లో  ఎవరెవరికో చెప్పని క్షమార్పణలు కూడా చెప్పారని, వారి గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా వారి పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా నిరాధార, అసత్య ప్రచారం జరుగుతోంది.  తప్పుడు ప్రచారం చేసిన యుట్యూబ్ ఛానెల్స్, సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టడం, పరువు నష్టం దావాలు వేస్తామని హెచ్చరించారు.        



Also Read : KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు