ABP  WhatsApp

G20 Summit 2022: జిన్‌పింగ్‌కు కెనడా ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్- డైలాగ్ వార్ లీక్!

ABP Desam Updated at: 17 Nov 2022 10:53 AM (IST)
Edited By: Murali Krishna

G20 Summit 2022: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య జరిగిన డైలాగ్‌ వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(Image Source: Twitter)

NEXT PREV

G20 Summit 2022: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Justin Trudeau), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌  (Xi Jinping) మధ్య ఇటీవల వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోనేసియా వేదికగా ఇటీవల జరిగిన జీ-20 సదస్సులో (G20 Summit) ఈ ఆసక్తికర పరిణామం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన డైలాగ్ వార్‌ కెమెరాకు చిక్కింది.


ఇదీ జరిగింది


జీ20 సదస్సులో భాగంగా కెనడా (Canada), చైనా (China) దేశాధినేతలు జస్టిన్ ట్రూడో, షి జిన్‌పింగ్ భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశాల్లో భాగంగా ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణల వివరాలన్నింటినీ కెనడా ప్రధాని కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. ఇలా చేయడాన్ని జిన్‌పింగ్ తప్పుబట్టారు. కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. 







సమావేశానికి సంబంధించిన అన్నివివరాలూ మీడియాకు ఎందుకిచ్చారు? అలా ప్రతి చిన్న విషయాన్నీ మీడియాకు లీక్ చేయడం సరికాదు. చర్చలు జరిపే పద్ధతే ఇది కాదు. ఇలా చేయడం నిజాయితీతో కూడిన విధానం కాదు. ఇకపైన చర్చలు జరిపే ముందే నిబంధనలు పెట్టుకుందాం.                                       - జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు


అయితే జిన్‌పింగ్ వ్యాఖ్యలకు కెనడా ప్రధాని ట్రూడో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.



చర్చల వివరాలన్నింటినీ మీడియాకు ఇవ్వడంలో తప్పేమీ లేదు. చర్చల్లో అన్ని అంశాలపై ఏకాభిప్రాయాలు కుదరవు. కొన్నింటికి సమ్మతి ఉండకపోవచ్చు. మేము చాలా ఫ్రీగా ఉంటాం, పారదర్శకంగా ఉంటాం.                                  -       జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని


ఇలా ఇద్దరు నేతల మధ్య జరిగిన డైలాగ్‌ వార్‌ను ఓ కెనడా జర్నలిస్ట్ తన కెమెరాలో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Also Read: Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో కీలక అప్‌డేట్- అఫ్తాబ్‌కు నార్కో పరీక్షలు

Published at: 17 Nov 2022 10:48 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.