G20 Bali Summit: 'నాకు ఇంట్రెస్ట్ లేదు'- పుతిన్‌తో భేటీపై జో బైడెన్ వ్యాఖ్యలు!

ABP Desam Updated at: 13 Oct 2022 05:34 PM (IST)
Edited By: Murali Krishna

G20 Bali Summit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

'నాకు ఇంట్రెస్ట్ లేదు'- పుతిన్‌తో భేటీపై జో బైడెన్ వ్యాఖ్యలు

NEXT PREV

G20 Bali Summit: ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాతో పశ్చిమ దేశాల సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ మధ్య పుతిన్.. అణు హెచ్చరికలు చేయడంతో ఈ దూరం మరింత పెరిగింది. అమెరికా కూడా రష్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమయంలో పుతిన్‌తో భేటీ అవుతారా అన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర సమాధానం చెప్పారు.



చూడండి.. నాకు ఆయనతో సమావేశమయ్యే ఉద్దేశం లేదు. కానీ సమావేశం కావాలనుకుంటే అది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. జీ 20 సదస్సులో భాగంగా రష్యాలో నిర్బంధంలో ఉన్న బ్రిట్నీ గ్రినర్‌ విడుదల గురించి పుతిన్‌ మాట్లాడాలనుకుంటే నేను ఆయనతో సమావేశం అవుతాను. ఆ మీటింగ్ ఆయన మాట్లాడే అంశంపై ఆధారపడి ఉంటుంది.                         - జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు


ఈ ఏడాది ఇండోనేషియాలోని బాలిలో జీ 20 సమావేశాలు జరగనున్నాయి. బ్రిట్నీ గ్రినర్ అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. ఒలింపిక్ పతక విజేత. ఆమె డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలతో మాస్కో విమానాశ్రయంలో అరెస్టు చేశారు. రష్యా ప్రభుత్వం ఆమెకు జైలు శిక్ష విధించింది.


అమెరికా సాయం


ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా చేసిన మిసైల్ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌కు సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు.



ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను బైడెన్‌ ఖండించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు అవసరమైన సాయం చేసేందుకు బైడెన్ హామీ ఇచ్చారు. ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు అందిస్తామని చెప్పారు. "
-శ్వేత సౌధం 



బాంబుల మోత


ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సోమవారం మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. రష్యాకు సంబంధించిన ఆస్తులపై దాడులకు దిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఉక్రెయిన్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చారు.


లాంగ్ రేంజ్ మిసైల్స్‌.. ఈ రోజు ఉక్రెయిన్‌కు సంబంధించిన ఎనర్జీ, ఆర్మీ & కమ్యూనికేషన్ ఫెసిలిటీస్‌పై దాడి చేశాయి. మా భూభాగంలో తీవ్రవాద చర్యలను ఉక్రెయిన్ కొనసాగిస్తే, రష్యా ప్రతిస్పందన కఠినంగా ఉంటుంది. మాకు ఏ స్థాయిలో బెదిరింపులు వస్తే మా రియాక్షన్ అదే రేంజ్‌లో ఉంటుంది. క్రిమియా బ్రిడ్జి పేలుడు ఓ ఉగ్రవాద చర్య. వంతెన దాడి వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు ఉన్నాయి. ఉక్రెయిన్.. టర్కిష్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పేల్చివేయడానికి కూడా ప్రయత్నించింది. రష్యాపై దాడులు కొనసాగితే.. మా రియాక్షన్ తీవ్రంగా ఉంటుంది.  "


-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

Also Read: PM Modi Himachal Visit: 'చూడండి చూడండి ఎవరొచ్చారో- పులి వచ్చింది పులి'- మోదీని చూసి నినాదాలు!


 


 

Published at: 13 Oct 2022 05:34 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.