PM Modi Himachal Visit: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఉనాలో ఈ ఉదయం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం అక్కడకు వచ్చిన కార్యకర్తలు.. మోదీకి ఘన స్వాగతం పలికారు.
షేర్ ఆయా!
ఈ సందర్భంగా అభిమానులు 'మోదీ.. మోదీ, జై శ్రీరాం' వంటి నినాదాలతో రైల్వే స్టేషన్ పరిసరాలను హోరెత్తించారు. రైలు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని రైల్వే ప్లాట్‌ఫాం నుంచి అలా నడుచుకొని వెళ్తూ జనానికి అభివాదం చేశారు.
ఈ సందర్భంగా కొంతమంది "దేఖో దేఖో కౌన్ ఆయా.. షేర్ ఆయా.. షేర్ ఆయా" (చూడు చూడు ఎవరు వచ్చారో.. పులి వచ్చింది.. పులి) అంటూ నినాదాలు చేశారు.
ఎలక్షన్ హీట్
త్వరలో హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో.. నాలుగో వందే భారత్ ట్రైన్‌ను ఇక్కడి నుంచే ప్రారంభించారు మోదీ. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించిన తరవాత...ప్రధాని ఓ సభలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు తీర్చని సమస్యల్ని భాజపా తీర్చుతోందని, ప్రజల అవసరాలను అర్థం చేసుకుంటోందని వెల్లడించారు.
అని వెల్లడించారు. తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అని..త్వరలోనే హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో ఉన్న బల్క్ డ్రగ్ పార్క్‌లో రూ.2వేల కోట్ల పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే తయారయ్యే అవకాశం కల్పిస్తే మందులు తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
Also Read: Kerala Black Magic: పిల్లలతో క్షుద్ర పూజలు- మంత్రగత్తె అరెస్ట్, కేరళలో మరో ఘటన!