Ayodhya Trust QR Code Scam: 


క్యూఆర్ కోడ్ మోసాలు..


అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ పేరు చెప్పి కొందరు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఎలాంటి అప్రూవల్ లేకుండానే కొందరు QR Codeల ద్వారా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్రహోం శాఖకూ ఫిర్యాదులు అందించింది. ఆ వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. X లో అధికారికంగా ఓ పోస్ట్ పెట్టింది. విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ అందరినీ అలెర్ట్ చేశారు. అలాంటి మాయగాళ్ల వలలో చిక్కుకోవద్దని సూచించారు. Sri Ram Janmabhoomi Teerth Kshetra ట్రస్ట్ పేరు చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. యూపీ పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చిన వెంటనే హోంశాఖకు కూడా ఓ కాపీ పంపినట్టు వెల్లడించారు. ఈ మధ్యే వీహెచ్‌పీ Xలో ఓ పోస్ట్ పెట్టింది. ట్రస్ట్ పేరిట విరాళాలు సేకరించేందుకు ఎవరికీ అనుమతినివ్వలేదని తేల్చి చెప్పింది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


"అప్రమత్తంగా ఉండండి. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నకిలీ ఐడీ కార్డులతో కొంత మంది మోసం చేస్తున్నారు. మాటల్లో దింపి ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు. దయచేసి వాళ్లను నమ్మకండి. ఇప్పటికే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాం"


- వినోద్ బన్సాల్, వీహెచ్‌పీ ప్రతినిధి






అయోధ్య రైల్వే స్టేషన్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న స్టేషన్‌కి కొత్త హంగులు అద్ది మరింత అందంగా తీర్చి దిద్దారు. దీనికి అయోధ్య ధామ్ జంక్షన్ (Ayodhya Dham Junction) అని పేరు పెట్టారు. ఈ రెనోవేషన్‌ కోసం ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చు చేసింది. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు, వెయిటింగ్‌ హాల్స్, క్లాక్‌రూమ్స్‌తో పాటు ఫుడ్ ప్లాజాలు ఏర్పాటు చేసింది. రామ మందిర ఆకృతిలోనే స్టేషన్‌ని తీర్చి దిద్దారు. ఇదే స్టేషన్‌లో ఆరు వందేభారత్ రైళ్లతో పాటు, రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. పుష్‌పుల్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. రైల్వే స్టేషన్‌ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఆ తరవాత ఎయిర్‌పోర్ట్‌నీ ప్రారంభించారు. వచ్చే ఏడాది జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ వేడుకల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టారు. 


Also Read: క్రికెట్ ఆడిన వెంటనే నీళ్లు తాగి 17 ఏళ్ల కుర్రాడి మృతి - గుండెపోటే కారణమా?