UP News in Telugu:


17 ఏళ్ల కుర్రాడు మృతి..


యూపీలో అల్మోరా జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ఆడిన వెంటనే నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 30వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. పదోతరగతి చదువుతున్న ప్రిన్స్ సైనీ ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఆట అయిపోయిన వెంటనే కడుపు నిండా చల్లని నీళ్లు తాగాడు. తరవాత కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా షాక్ అయిన స్నేహితులు బాధితుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఇది అనుమానాస్పద మృతిగానే మిగిలిపోయింది. గుండెపోటు వల్ల చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే...తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గతంలోనూ ఇలాంటి మరణాలు నమోదయ్యాయి. క్రికెట్ ఆడుతుండగానే ఓ వ్యక్తి కుప్ప కూలిపోయాడు. గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.


చల్లని నీళ్లతో ప్రమాదం.. 


ఎండల్లో ఇంటికి వచ్చిన వెంటనే చాలామంది చేసే పని ఫ్రిజ్ లోంచి అతి చల్లని నీరు తీసి తాగడం. ఇది ధమనుల్లో ఆకస్మిక వాసోస్పాస్మ్ ఏర్పడడానికి కారణం అవుతుంది. అంటే ధమనులు కూచించుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డు తగులుతాయి. ఈ పరిస్థితి గుండెపోటుకు కారణంగా మారుతుంది. కాబట్టి చల్లని నీరు గుండెపోటుకు ట్రిగ్గర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లని నీరును తాగడం మానుకోండి. ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం చల్లని నీరు తాగుతారు. గుండె సమస్య ఉన్న వారిలో ఇలా చల్లని నీరు తాగడం ప్రాణాంతకమైన కార్డియాక్ అరిథ్మియాను ప్రేరేపిస్తుంది. చల్లని నీరు తాగిన వెంటనే శరీరం తీవ్రమైన ప్రతిస్పందనను చూపిస్తుంది. ఆ ప్రతిస్పందనలో గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి చల్లని నీరు తాగడం తగ్గించాలి.


ఇలా చేయాలి..


వైద్యులు చెబుతున్న ప్రకారం ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల అవయవ వ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. శరీరం నుండి బ్యాక్టీరియా బయటికి పోతుంది. ఆక్సిజన్, పోషకాల రవాణా రక్తం ద్వారా సవ్యంగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. హృదయ స్పందనలో స్థిరత్వం ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం పెరగడం, తగ్గడం వంటివి జరగదు. కాబట్టి అతి చల్లని నీరు తాగడం మానుకోవాలి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటినే తాగడం అలవాటు చేసుకోవాలి. ఎవరికైనా హఠాత్తుగా గుండె ఆగిపోతే... వారి పక్కన ఉన్నవారు మళ్ళీ గుండెను కొట్టుకునేలా చేసే ప్రక్రియ CPR. దీని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఇది ఎలా చేయాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఎదురుగా ఎవరైనా స్పృహ కోల్పోయినట్టు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. గుండెపోటు వల్ల వారు పడిపోతే, ఆ వ్యక్తి వద్దకు వెళ్లి రెండు భుజాలను పట్టుకుని గట్టిగా ఊపుతూ వారిని లేపడానికి ప్రయత్నించాలి. ఎంతగా ఊపినా వారు లేవకపోతే, వారు ఊపిరి తీసుకుంటున్నారో లేదో గమనించాలి. ఊపిరి తీసుకోకపోతే వెంటనే ఆ వ్యక్తికి గాలి ఆడేలాగా చేయాలి. బిగుతైన దుస్తులు వేసుకుంటే వాటిని విప్పేయాలి. 


Also Read: బాహుబలిజీ రెజ్లర్ల కన్నీళ్ల కన్నా విలువైందా మీ గొప్పదనం - మోదీపై రాహుల్ సెటైర్లు