Ration Card E-Kyc Deadline : రేషన్ కార్డు ( Ration Card) ఉన్న లబ్దిదారులు జనవరి (Januaray) 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని తెలంగాణ (Telangana) ప్రభుత్వం ( Government) సూచించింది. రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి చేయని వారు త్వరగా చేయాలని పౌరసరఫరాలశాఖ (Civil Supplies) ఉత్తర్వులు జారీ చేసింది.  గత రెండు నెలలుగా రేషన్ సరఫరా షాపుల్లో డీలర్లు ఈ-కేవైసీ అప్ డేట్ చేస్తున్నారు. ఇందుకోసం ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలు గుర్తింపును సేకరిస్తున్నారు. ఎవరైనా ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని, కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ బియ్యం ఇవ్వరని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డుదారులు జనవరి 31 లోగా... రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు  లింక్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. 


ఈ-కేవైసీ చేయకపోతే నో రేషన్


రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీడింగ్ చేయకపోతే రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనున్నారు. రేషన్ కార్డు డిలీట్ అయితే ప్రభుత్వ డేటాలో రేషన్ కార్డు వివరాలన్నీ వెళ్లిపోతాయి. తర్వాత రేషన్ షాపులకు వెళ్లినా ఎలాంటి ఉపయోగం ఉండదు. రేషన్ కార్డును ఆధార్ నంబర్‌తో లింక్ చేయడానికి...రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి ఆధార్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ-కేవైసీని పూర్తి చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 30 నాటికి ఈ ప్రక్రియ 70.80 శాతం ఈ-కేవైసీ పూర్తయినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.


మొదటి స్థానంలో మేడ్చల్, చివరి స్థానంలో వనపర్తి


మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 87.81 శాతంతో మొదటి స్థానంలో ఉంది.  54.17 శాతంతో వనపర్తి జిల్లా చివరి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా...దేశవ్యాప్తంగా ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తోంది. లక్షల్లో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం...ఆధార్ నంబర్‌తో లింక్  చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువును పలుసార్లు పొడిగించిన ప్రభుత్వం...తాజాగా జనవరి 31ని డెడ్ లైన్ గా విధించింది. అప్పటిలోపు రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయని వారికి బియ్యం కట్ చేయనున్నారు.