Kotabommali PS movie OTT release on sankranti 2024: పెద్ద పండక్కి ఆహా ఓటీటీ వేదిక ఓ మంచి సినిమాను వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ మేక (Srikanth Meka) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కోటబొమ్మాళి పీఎస్'. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఇందులో ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరో. యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్. 


అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి 'కోటబొమ్మాళి పీఎస్' చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 24న ఈ సినిమాను థియేటర్లలో విడుదలైంది. త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. 


సంక్రాంతికి ఆహా ఓటీటీకి కోటబొమ్మాళి పీఎస్!
కోటబొమ్మాళి పీఎస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటీటీ వేదిక ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమాను సంక్రాంతికి డిజిటల్ తెరపైకి తీసుకు వస్తున్నట్లు ఆహా సంస్థ వెల్లడించింది.


Also Read: ముట్టుకోవద్దని చెప్పాను కదరా... ప్రభాస్‌ను వాడుకున్న పోలీసులు






తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్!
Kotabommali PS movie director: 'కోట బొమ్మాళి పీఎస్' చిత్రాన్ని యువ దర్శకుడు తేజా మార్ని తెరకెక్కించారు. ఆయన దర్శకుడిగా పరిచయమైన 'జోహార్' డైరెక్టుగా ఆహా ఓటీటీలో విడుదల అయ్యింది. ఆ సినిమా విమర్శకులతో పాటు వీక్షకుల ప్రశంసలు అందుకుంది. తొలి సినిమా తర్వాత శ్రీ విష్ణు కథానాయకుడిగా 'అర్జున ఫాల్గుణ' తీశారు. ఇప్పుడు మూడో సినిమాగా మలయాళ హిట్ 'నాయట్టు'ను 'కోట బొమ్మాళి పీఎస్'గా రీమేక్ చేశారు.


Also Readబన్నీ పాట మహేష్‌కు... కుర్చీ మడతపెట్టి కాపీయే



'కోట బొమ్మాళి' రీమేక్ సినిమా అయినప్పటికీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన యాస, భాషలను కథకు అద్దడంలోనూ, మన నేటివిటీకి తగ్గట్లు సినిమా తీయడంలోనూ దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా శ్రీకాంత్ పాత్రకు చాలా పేరు వచ్చింది. వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం డిఫరెంట్ రోల్ చేశారని చాలా మంది ప్రశంసించారు. 


'కోట బొమ్మాళి పీఎస్' సినిమాలో హోమ్ మంత్రి పాత్రలో మురళీ శర్మ నటించారు. ఆయన పాత్రకు కూడా మంచి స్పందన లభించింది. ఇంకా బెనర్జీ, దయానంద్, సివిఎల్ నరసింహారావు, ప్రవీణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి, ఛాయాగ్రహణం : జగదీష్ చీకటి, మాటలు : నాగేంద్ర కాశి, కూర్పు : కార్తీక శ్రీనివాస్ ఆర్, కళా దర్శకత్వం : గాంధీ నడికుడికర్, సంగీతం : రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అజయ్ గద్దె, కాస్ట్యూమ్ డిజైనర్ : అపూర్వ రెడ్డి.