నిరుద్యోగుల ఆశలు, ఆంక్షలు ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల వసూలు చేస్తున్నారు. ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకున్న ఓ కేటుగాడు ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరతీశాడు. లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగం ఇస్తామని చెప్పి, నిరుద్యోగుల నుండి కోట్ల రూపాయలను వసూలు చేసి మోసం చేశాడు. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సదరు కేటుగాడి వ్యవహారం బయటకు వచ్చింది. వీరిలానే ఎంతో మంది బాధితులు ఉద్యోగం పేరుతో సొమ్ము చెల్లించి మోసపోతున్నారు.


నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని, ఆదాయపన్ను శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  ఇలా నిరుద్యోగుల నుంచి సుమారు 26 లక్షల వరకు వసూలు చేశాడు. ఈ నకిలీ బీట్ ఆఫీసర్ ను చర్లపల్లి పోలీసులు అరెస్టు చేయడంతో మోసం బయట పడింది. 


వివరాల్లోకి వెళితే... కొనకంచి కిరణ్ కుమార్ అనే వ్యక్తి అటవీశాఖ నకిలీ గుర్తింపు కార్డు, యూనిఫామ్, ఓ బొమ్మ తుపాకీతో సంచరిస్తూ కట్టెల లోడ్ తో వెళ్తున్న వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడుతూ ఉండేవాడు. అంతేకాకుండా నిరుద్యోగుల నుంచి సుమారు 26 లక్షల వరకు వసూలు చేసినట్లు ఇతడి పై ఆరోపణలు ఉన్నాయి.


చర్లపల్లి లోని బి.యన్.రెడ్డి నగర్ కు చెందిన బోయిన సంతోష్ అనే బాధితుడి ఫిర్యాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు యూసుఫ్ గూడా లో నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ ను చర్లపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గతంలో అతడు ఖమ్మం అటవీ శాఖలో ఔట్సోర్సింగ్ లో పనిచేసి మానేసినట్లు పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో నిరుద్యోగులను టార్గెట్ చేసినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన బాధితుడు సంతోషించి సుమారు 4.5 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కోసం నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 


మోసపోవద్దని పోలీసుల సూచన
సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనలను చూసి మోసపోవద్దని పదేపదే చెబుతున్నా నిత్యం ప్రజలు మోసపోతూనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏ కారణంగానూ ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వకుండా జాగ్రత్తలు పడాలని కోరుతున్నారు.  చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఇటువంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు వెల్లడిస్తునారు.


ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ప్రతిభ ఆధారంగానే భర్తీ అవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు . ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అయిన వ్యక్తి  ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే అదే కంపెనీలో పనిచేసే ఉద్యోగులను ఎవరినైనా సంప్రదించి క్రాస్ చెక్ చేసుకోవనై చెబుతున్నారు. నిరుద్యోగ యువత గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు కోరుతున్నారు.  ఎవరైనా మోసనికి పాల్పడితే తమను సంప్రదించాలని సూచిస్తున్నారు.