Viral Video: అటవీ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో వన్య మృగాల బెడద సాధారణమే. అయితే ఒక్కోసారి ఏనుగులు.. వాహనాలపై దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ప్రస్తుతం మంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ కాన్వాయ్‌ని ఓ ఏనుగు అడ్డుకుంది. ప్రాణ భయంతో మంత్రి కారు దిగి పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






ఇదీ జరిగింది


ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌-దుగడ్డ హైవేపై మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ కాన్వాయ్‌ని ఓ ఏనుగు అడ్డుకుంది. ఆయన కారులో వస్తుండగా సడెన్‌గా అడవి నుంచి ఒక ఏనుగు రోడ్డుపైకి వచ్చింది. దీంతో ఆయన కాన్వాయ్‌ను అధికారులు కాసేపు ఆపుచేశారు. అయితే ఎంతకీ ఏనుగు వెళ్లలేదు. 


మాజీ సీఎం ఏనుగు వెళ్లిపోతుందనుకుని కారులోనే కూర్చుని ఉన్నారు. కానీ ఆ ఏనుగు అనుహ్యంగా మంత్రి కారువైపు రావడంతో మంత్రితో సహా ఆయనతో పాటు ఉన్న జనాలు కూడా భయంతో కారుదిగి పరిగెత్తారు. రావత్.. చివరకు కొండ ఎక్కి ప్రాణాలను ఎలాగోలా రక్షంచికున్నారు. దాదాపు అరగంటపాటు మాజీ సీఎం కాన్వాయ్‌ అక్కడే ఉండాల్సి వచ్చింది.


వైరల్ వీడియో


సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది గాలిలో కాల్పులు జరిపి ఏనుగును ఎలాగోలా తరిమికొట్టారు. త్రివేంద్ర సింగ్ కొండెక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరో ఘటన


ఇటీవల ఓ ఏనుగు చేసిన ఘటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనకు దురదేస్తే ఏం చేస్తాం? గోక్కుంటాం. అదే మరి ఏనుగుకు దురదేస్తే ఏం చేస్తుంది? ఈ వీడియోలో అదే జరిగింది. ఓ ఏనుగుకు దురద వచ్చి కారుపై తన ప్రతాపం చూపింది. ఏనుగు దెబ్బకు కారు తుక్కుతుక్కయింది. అయితే గోక్కోవడం తప్ప ఏనుగు ఎలాంటి దాడి చేయకపోవడంతో ఆ సమయంలో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. 




ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇది ఎక్కడ జరిగిందన్న విషయం తెలియదు. ఈ వీడియోను మాత్రం నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. "మీరే ఏనుగై ఉండి మీకు దురదేస్తే ఏం చేస్తారు?" అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


Also Read: Bharat Jodo Yatra: వ్యాపారిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి- జోడో యాత్రకు డబ్బులు ఇవ్వలేదని!


Also Read: Lucknow Wall Collapse: లఖ్‌నవూలో ఘోర ప్రమాదం- ప్రహారీ గోడ కూలి 9 మంది మృతి!