భార్యతో చేసే శృంగారం విషయంలో ఛత్తీస్ గఢ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్యతో బలవంతంగా శృంగారం చేయడాన్ని అత్యాచారంగా పరిగణించబోమని చత్తీస్‌ గఢ్‌ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తెలిపింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య మైనర్ (వయసు 18 ఏళ్లు లోపు) కాకుండా ఉన్నప్పుడు, ఆమెపై బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కాదని జస్టిస్ ఎన్‌కే చంద్రవన్షీ ధర్మాసనం తేల్చి చెప్పింది.


తాజా కేసులో ఇండియన్ పీనల్ కోడ్‌లోని 376వ అధికరణ కింద దాఖలైన అభియోగాల నుంచి 37 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా చేసింది. అయితే అతనిపై 377 అధికరణ కింద నమోదైన అసహజ నేరాలతో పాటు ఇతర అభియోగాలు కొనసాగుతాయని పేర్కొంది.  భార్య వయసు 18 ఏళ్లు లోపు లేకుండా ఉన్నప్పుడు బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కిందకు రాదని 376వ అధికరణలోని రెండో మినహాయింపు స్పష్టంగా చెబుతోందని న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌కే చంద్రవన్షీ తెలిపారు. అందుకే ఆ అభియోగాల నుంచి విముక్తి కల్పించినట్లు వివరించారు.


భార్యతో బలవంతంగా శృంగారం చేయడం చట్ట విరుద్ధమేం కాదని ఇటీవలే ముంబయిలోని అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జె ఘరాత్ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా ఛత్తీస్ గఢ్ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునే వెలువరించింది. అత్యాచారం అభియోగం ఎదుర్కొంటున్న ఓ భర్తను నిర్దోషిగా ప్రకటించింది. 


2017లో తనకు వివాహం జరిగిందని, కట్నం తేవాలంటూ తన భర్త వేధింపులకు గురి చేయడమే కాకుండా తనను హింసిస్తూ, బలవంతంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని పిటిషన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైనే తాజాగా కోర్టు తాజా తీర్పు వెలువరించింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య వయస్సు 18 ఏళ్లు లోపు లేకపోతే, బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కిందకు రాదని కోర్టు వెల్లడించింది. ఆ విషయంలో అతడిని విముక్తి కల్పించినట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అయితే, ఇతర నేరాల కింద అభియోగాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.