Jaishankar on Hanuman: 


థాయ్‌లాండ్‌లో పర్యటన..


థాయ్‌లాండ్ పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి ఇండియన్ కమ్యూనిటీతో మాట్లాడిన ఆయన హనుమంతుడి ప్రస్తావన తీసుకొచ్చారు. చరిత్రలో అందరికన్నా అతి గొప్ప దౌత్యవేత్త ఎవరైనా ఉన్నారంటే...అది హనుమంతుడు మాత్రమేనని అన్నారు. తనకు ఏ మాత్రం తెలియని వేరే దేశానికి (లంకకు) వెళ్లి అక్కడ సీతను కనుగొన్నాడని, అక్కడి కోటకు నిప్పు పెట్టాడని వ్యాఖ్యానించారు. ఇలా రామాయణాన్ని ఉదహరిస్తూ హనుమంతుడి గొప్పదనాన్ని ప్రస్తావించారు. 


"రామాయణాన్ని ఓ సారి గుర్తు చేసుకోండి. ఎవరైనా నన్ను గొప్ప దౌత్యవేత్త ఎవరు అని అడిగితే కచ్చితంగా హనుమంతుడి పేరే చెప్తాను. తనకు ఏ మాత్రం అవగాహన లేని ఓ దేశానికి వెళ్లాడు. సీతను కనుగొన్నాడు. ఆమెతో మాట్లాడాడు. ఆమె నమ్మకం కోల్పోకుండా చేశాడు. రావణుడి కోటకు నిప్పు పెట్టి వచ్చాడు. లంకాదహనం ఘటనను ప్రస్తుత దౌత్యంతో పోల్చడం సరికాకపోయినా...మొత్తంగా చూస్తే మాత్రం హనుమంతుడు విజయంతో తిరిగి వచ్చాడు"


- ఎస్‌ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి