వాట్సాప్ గ్రూప్‌లలో అప్పుడప్పుడు కొన్ని వార్తలు తెగ సర్క్యులేట్ అవుతాయి. అయితే అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో చాలా మందికి తెలియదు. తెలియకుండానే వాటిని మళ్లీ ఫార్వార్డ్ చేస్తాం. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించి కూడా తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని పత్రికలు, టీవీలు కూడా ఈ వార్తను చూపించాయి. మరి ఇందులో నిజమెంతో చూద్దాం.


ఇదే వార్త..


ఒక్క రూపాయి అప్పు లేని రాష్ట్రంగా దిల్లీ గుర్తింపు పొందింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా వచ్చే సమయానికి ఆ రాష్ట్రం అప్పుల బారిన పడి ఉంది. ఐఆర్ఎస్ అధికారి నుంచి రాజకీయవేత్తగా మారి ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ అప్పుల పరిస్థితి నుంచి దిల్లీని బయటకు తీసుకువచ్చి తన సమర్థతను చాటుకున్నారు.


ఈ వార్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్త నిజమా కాదా ఒకసారి చూద్దాం.


నిజమెంత?


దేశ రాజధాని దిల్లీకి అప్పు లేదు అనే మాట శుద్ధ తప్పు. దిల్లీకి కూడా అప్పు ఉంది. 2021-22 బడ్జెట్ ప్రసంగంలో దిల్లీకి 2020 మార్చి నాటికి సుమారు 31 వేల కోట్ల అప్పు ఉందని దిల్లీ ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు.


అంతే కాదు, 2021-22 ఏడాదికి సుమారు 9,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని కూడా అన్నారు. ఆర్‌బీఐ 'State Finance 2020-21' ప్రకారం, GSDPలో అప్పు శాతం డేటా చూస్తే మనకు ఈ విషయంపై ఇంకా స్పష్టత వస్తుంది. కనుక దిల్లీకి అప్పు లేదని చెప్పడంలో నిజంలేదు.


దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమర్థవంతమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పంజాబ్‌లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమ్‌ఆద్మీ పంజాబ్‌లో ప్రతిపక్షంగా ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీగా ఉంది.


ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమ్‌ఆద్మీ పోటీకి సిద్ధమైంది. ఆ రాష్ట్రాల్లో కూడా పోటీ ఇచ్చేందుకు ఆమ్‌ఆద్మీ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.


Also Read: Kerala Trekker Rescued: ఆ కేరళ ట్రెక్కర్ సేఫ్, ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ Watch Video


Also Read: JanDhan Money : అకౌంట్‌లో రూ. 15లక్షలు జమ .. జై మోదీ అని ఖర్చు ! కానీ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు...