EWS Reservation: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS)కు రిజర్వేషన్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో కల్పించే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని తీర్పు ఇచ్చింది. అప్పటి సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ సహా నలుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
3:2
న్యాయమూర్తుల్లో ముగ్గురు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉంటుందని ప్రకటించగా ఇద్దరు మాత్రం తీర్పుతో విభేధించారు. అప్పటి సీజేఐ యూయూ లలిత్.. జస్టిస్ రవీంద్ర భట్‌తో ఏకీభవించారు. అయితే జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా మాత్రం #EWS సవరణను సమర్థించారు.
సమర్థిస్తూ
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం కోటా (రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ ఈ పిటిషన్లను కొట్టివేసింది.
అప్పటి సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక మంది సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆరున్నర రోజల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించడమంటే.. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీం కోర్టుకు కొందరు న్యాయవాదులు నివేదించారు. రిజర్వేషన్లపై 50%గా ఉండాల్సిన పరిమితిని అది అతిక్రమిస్తోందని, క్రీమీలేయర్ విధానాన్ని ఓడిస్తోందని పేర్కొన్నారు. ఆ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మినహాయిస్తుండటాన్నీ తప్పుపట్టారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించింది.
ఇదీ చట్టం
ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 2019, ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చింది. దీంతో వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతోందని ప్రభుత్వం చెబుతోంది.
Also Read: Asaduddin Owaisi On Modi: మోదీ సర్కార్‌ను నమ్ముకోవద్దు, పెళ్లి చేసుకోండి: ఒవైసీ