Punjab Elections Results: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archar) ఎనిమిది నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. కానీ అతడి ట్వీట్లకు మాత్రం ప్రజాదరణ తగ్గడంలేదు. ఊహాజనిత ట్వీట్‌లను పెట్టడంలో ఆర్చర్ పేరు ముందు వరుసలో ఉంటుంది. క్రికెట్ యేతర కారణాల్లో కూడా అతడి ట్విట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా పంజాబ్ ఫలితాలను ఉద్దేశించి ఆమ్ ఆద్మీ పార్టీ జోఫ్రా ఆర్చర్ పెట్టిన ట్వీట్ ను రీట్వీట్ చేసింది. ఫిబ్రవరి 20న ఆర్చర్ "స్వీప్" అని ట్వీట్‌ను అప్‌లోడ్ చేశాడు. పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికలలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ "క్లీన్ స్వీప్" అని పేర్కొంటూ ఆర్చర్ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. దీంతో ఆర్చర్ మరోసారి వార్తల్లో నిలిచారు. 






పంజాబ్ లో ఆప్(AAP) భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(59) దాటిన ఆప్ ఇప్పటికే 92 స్థానాల్లో విజయం సాధించింది.  దేశ రాజధాని దిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ మరో రాష్ట్రంలో తమ అధికారాన్ని విస్తరించింది. పంజాబ్ లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ ను కేజ్రివాల్ ఇప్పటికే ప్రకటించారు. పంజాబ్ కు భగవత్ మాన్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు కేవలం 18 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. శిరోమణి అకాళిదల్ 4 స్థానాల్లో విజయం సాధించింది.  


పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ 


పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. అక్కడ ఆప్ గెలిస్తే సీఎం ఎవరు అవుతారో కేజ్రీవాల్ ముందుగానే ప్రకటించారు. ఆయనే భగవంత్ మన్. ఆయన రాజకీయ పయనం ఆసక్తికరం. రాజకీయ పరిస్థితుల్ని కామెడీగా ప్రజల ముందు ఉంచే స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. రాజకీయాల్లో ఎదిగిన నేత భగవంత్ మన్. ఆయనపై విశేషాలే కాదు.. వివాదాలు కూడా ఉన్నాయి. 2011 లో మన్ ప్రీత్ సింగ్ బాదల్ పీపుల్స్ పార్టీ తో రాజకీయాల్లోకి వచ్చిన మాన్ కు స్టార్టింగ్ లో అన్నీ ఎదురుదెబ్బలే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు కూడా. 2014లో ఆప్ లో చేరాలని అతను తీసుకున్న డెసిషన్ మాన్ పొలిటికల్ కెరీర్ ను ప్రభావితం చేసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో సొంత జిల్లా సంగ్రూర్ ఎంపీగా రెండు లక్షలకు పైగా మెజారీటీ తో గెలిచి పార్లమెంట్ కు వెళ్లారు మాన్. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో 2017 లో శిరోమణి అకాళీదళ్ అగ్రనేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ పైనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 లో మరోసారి ఎంపీగా పోటీ చేసిన మాన్ విజయం సాధించి....రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.