Emotional Video:
గట్టిగా హత్తుకుని...ఏడ్చేసి..
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఉన్నట్టుండి వైరల్ అయిపోతుంటాయి. వీటిలో కొన్ని సరదాగా ఉంటే..మరి కొన్ని ఎమోషనల్‌గా ఉంటాయి. మనసుని మెలి పెట్టేస్తాయి. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. చిన్నతనంలో తనకు సపర్యలు చేసిన కేర్‌టేకర్‌నుకలిసేందుకు స్పెయిన్ నుంచి బొలీవియాకు ప్రయాణం చేశాడో వ్యక్తి. దాదాపు 45 ఏళ్ల తరవాత ఆమెను కలిసేందుకు ఇలా బయల్దేరిన ఆ వ్యక్తి..తన ప్రయాణ మంతటినీ వీడియో తీశాడు. జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి మూమెంట్‌ను ఇలా రికార్డ్ చేశాడు. ఆమెను కలిసి హగ్ చేసుకునేంత వరకూ... అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన వాళ్లు వావ్ అనటమే కాదు...ఎమోషనల్ అవుతున్నారు కూడా. Goodnews Movement అఫీషియల్ ట్విటర్ అకౌంట్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో...ఆ వ్యక్తి తన కేర్‌టేకర్‌ను కలుసుకునేందుకు ఎలా శ్రమించాడో చూపించారు. తన చిన్నతనంలో కన్న బిడ్డను చూసుకున్నట్టుగా ఆమె చాలా జాగ్రత్తగా చూసుకుందని, అందుకే ఇంత దూరం వచ్చి ఆమెను కలుసుకుంటున్నానని చెప్పాడా వ్యక్తి. 45 ఏళ్ల తరవాత అతడిని చూసి ఆ కేర్ టేకర్ ఎమోషనల్ అయిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. గట్టిగా హత్తుకుని...అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు "సో బ్యూటిఫుల్. నేను మా సిస్టర్స్ మా కేర్‌టేకర్‌ను కలుసుకునేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాం. కానీ..ఇప్పటికీ అది సాధ్యం కాలేదు" అని ట్వీట్ చేశాడో నెటిజన్. "ఎంత అద్భుతం" అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.