Election Results 2023:
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటికే త్రిపురలో లీడ్‌లో ఉన్న బీజేపీ...నాగాలాండ్‌లోనూ ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశముందని ప్రస్తుత ట్రెండ్‌ను గమనిస్తే స్పష్టమవుతోంది. మొదట్లో మేఘాలయాలో బీజేపీకి కాస్త తక్కువ సీట్లే వస్తాయని భావించిన క్రమంగా కౌంటింగ్ జరిగే కొద్ది లీడ్‌లోకి వచ్చేసింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే రంగంలోకి దిగి మేఘాలయా ఎన్నికల ఫలితాలను గమనిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే...ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. త్రిపురనే గమనిస్తే...బీజేపీ లీడ్‌లో ఉన్నట్టే కనిపిస్తున్నా...అటు వామపక్ష పార్టీలు కూడా పోటీనిస్తున్నాయి. 60 సీట్లున్న త్రిపురలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 30 సీట్ల మార్క్‌ను సాధించాలి. ప్రస్తుతానికి బీజేపీ IPFTతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. ఈ కూటమికి 31 సీట్లు దక్కాయి. లెఫ్ట్ పార్టీలకు 18 సీట్లు వచ్చాయి. తిప్ర మోత పార్టీ (TMP) 12 చోట్ల విజయం సాధించింది. అంటే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే TMP పార్టీ కీలకంగా మారనుంది. చెప్పాలంటే ఇదే కింగ్ మేకర్ అవుతుంది. బీజేపీ కలిసి నడిస్తే మాత్రం NDA ప్రభుత్వమే మరోసారి ఏర్పాటు చేసే అవకాశముంది. ఇక మేఘాలయా విషయానికొస్తే... 59 సీట్లున్న ఈ రాష్ట్రంలో National People's Party (NPP)కి 24 సీట్లు దక్కాయి. బీజేపీకి మాత్రం కేవలం 6 సీట్లు దక్కాయి. అయితే NDPPతో నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బీజేపీ కూటమికి 41 సీట్లు వచ్చాయి. ఇక్కడ NDA ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.