Election Commission: ఓటింగ్ ప్రక్రియలో వినూత్న విధానానికి ఎన్నికల సంఘం తెరలేపనుంది.ఉపాధి నిమిత్తం దేశంలోని వివిధ నగరాలకు వెళ్లే వలస కార్మికులు.. తమ సొంత నియోజకవర్గంలో రిమోట్‌గా ఓటు వేసేందుకు కొత్త విధానాన్ని తయారు చేసింది. ఇందుకు సహాయపడే రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాన్ని (EVM) అభివృద్ధి చేసినట్లు ఎన్నికల సంఘం గురువారం తెలిపింది.
ఈ పరికరం దేశంలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా తమ నియోజకవర్గానికి ఓటు వేయడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా సెలవు దొరక్క, ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించి ఓటు వేయడానికి సొంత రాష్ట్రానికి వెళ్లలేని ఓటర్లకు పెద్ద ఉపశమనం ఇవ్వనుంది.
ఈ పరికరాన్ని ప్రదర్శించి, వివరించేందుకు జనవరి 16న రాజకీయ పార్టీలను ఈసీ ఆహ్వానించింది. యంత్రాన్ని అమలు చేయడంలో ఎదుర్కొనే చట్టపరమైన, కార్యాచరణ, పరిపాలనా, సాంకేతిక సవాళ్లపై పార్టీల అభిప్రాయాలను పొందడం కోసం దీనిని ప్రదర్శించనుంది.
Also Read: Covid-19 in China: 'అంతా ఉత్తుత్తిదే'- కరోనా కేసుల వార్తలపై చైనా బుకాయింపు!