ABP  WhatsApp

PM Modi's Ferozepur Visit: 'ఇదంతా మోదీ ప్రతీకారమే.. కానీ పంజాబ్‌ అంతకంత తిరిగిస్తుంది'

ABP Desam Updated at: 19 Jan 2022 08:15 PM (IST)
Edited By: Murali Krishna

పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఈడీ దాడులపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ ప్రతీకారం తీసుకుంటున్నారని ఆరోపించారు.

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ

NEXT PREV

ఎన్నికలు దగ్గర పడిన వేళ పంజాబ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడంపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పందించారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికి ఈడీని ప్రధాని మోదీ ఓ అస్త్రంగా వాడుకుంటున్నారని చన్నీ ఆరోపించారు. ఇసుక మాఫియా కేసులో చన్నీ దగ్గరి బంధువుకు చెందిన 8 వేరువేరు ప్రాంతాల్లో మంగళవారం ఈడీ ఏకకాలంలో దాడులు చేసింది. దీనిపై చన్నీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.







కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీలను.. మోదీ సర్కార్ అస్త్రాలుగా వాడుకుంటోంది. నా బంధువు ఇళ్లలో ఈడీ దాడికి కారణం ప్రతికారం మాత్రమే. ఇటీవల ప్రధాని మోదీ ఫిరోజ్‌పుర్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాన్ని ఆయన మనసులో పెట్టుకున్నారు. బంగాల్, పంజాబ్ ఇలా ఏ రాష్ట్రమైనా కావొచ్చు. ప్రతి చోట విప్లవం మొదలైంది. దిల్లీ (మోదీ సర్కార్) మమ్మల్ని అణకదొక్కాలని చూస్తోంది.. కానీ పంజాబ్ దానికి తగ్గట్లు తిరిగి ఇస్తుంది.                                               -    చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ ముఖ్యమంత్రి


ఈడీ చేసిన దాడులను కాంగ్రెస్ కూడా ఖండించింది. దేశంలో ఉన్న ఒకే ఒక్క దళిత ముఖ్యమంత్రిని మోదీ సర్కార్ ఇబ్బంది పెడుతుందని కాంగ్రెస్ ఆరోపించింది.


8 కోట్లు స్వాధీనం..


పంజాబ్​ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ దగ్గరి బంధువు భూపిందర్​ సింగ్​ నివాసాల్లో ఈడీ మంగళవారం దాడులు నిర్వహించింది. ఆయన ఇళ్లలో రూ. 8 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తనిఖీలు నిర్వహించింది.


Also Read: Aparna Yadav BJP: ములాయం సింగ్ దీవెనలతోనే భాజపాలో చేరాను: ABPతో అపర్ణా యాదవ్


Also Read: Aparna Yadav Joins BJP: అనుకున్నట్లే అయింది.. భాజపాలోకి ములాయం చిన్నకోడలు.. సమాజ్‌వాదీలో గుబులు!


Also Read: UP Election 2022: ఊ అన్న అఖిలేశ్ యాదవ్.. యూపీ ఎన్నికల బరిలో ఇక సమరమే!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Published at: 19 Jan 2022 08:13 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.