మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా ? . నలుగురు మిత్రులకు ఫోన్ చేసి మాట్లాడండి ! వారిలో కనీసం ఒకరికైనా కరోనా లక్షణాలు అయిన జబులు, తుమ్ములు, జ్వరం, గొంతునొప్పి వంటివి ఉన్నాయని చెబుతారు. ఇది మనం వేసుకునే సాదాసీదా అంచనాలు. కానీ ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఫీవర్ సర్వే కూడా ధృవీకరించింది. 


Also Read: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..


తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ సర్వేలో తేలింది. మున్ముందు కేసులు మరింతగా పెరవచ్చునని సర్వే అంచనా వేసింది. డిసెంబర్ రెండవ వారం నుంచి ఏఎన్ఎంలు, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో 20 లక్షల మందికిపైగా కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు.  అలాగే జిల్లాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లుగా తెలుస్తోంది. 


Also Read: AP Night Curfew: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు


ఒమైక్రాన్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని... రానున్న రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది.  వైద్య ఆరోగ్యశాఖ నివేదిక గురించి చెప్పకపోయినా ఈ శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఇదే విషయాన్ని మూడు రోజుల కిందట చెప్పారు. వచ్చే మూడు వారాలు అత్యంతకీలకమన్నారు. ఇప్పుడు ఆయన కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


Also Read: పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగేస్తున్నారా? ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి


కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవడం లేదు. సెల్ఫ్ ఐసోలేట్ అవుతున్నారు. పాజిటివ్ అని తేలినప్పటికీ.. ప్రత్యేకమైన చికిత్స లేకపోవడం.. తేలికపాటి లక్షణాలు ఉండయం.. లక్షణాలు లేని వారిని హోంఐసోలేషన్‌కే ప్రిఫర్ చేస్తూండటంతో టెస్టులు చేయించుకోకుండానే చాలా మంది ఐసోలే అవుతున్నారు. అందువల్ల నమోదవుతున్న కేసులు కూడా తక్కువగానే ఉంటున్నాయని.. కానీ పరిస్థితి ఊహించనంత తీవ్రంగా ఉందని అంచనా వేస్తున్నారు. 


Also Read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు


 




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి