Sanjay Raut ED Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ సోదాలు చేస్తోంది. పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో విచారణ కోసం హాజరుకావాలని సంజయ్ రౌత్‌కు ఈడీ రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఆ ఆదేశాలను పాటించకపోవడంతో ఈ చర్యలు చేపట్టింది.
ఈడీ వేట
భాజపా, ఏక్‌నాథ్ శిందే వర్గంపై తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెంటాడుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారుల బృందం సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి ముంబయి బందూప్‌లో ఉన్న సంజయ్ నివాసానికి చేరుకున్నారు.
తనిఖీలు ప్రారంభించారు. ముంబయిలోని ఓ భవనం అభివృద్ధి, దానికి సంబంధించిన లావాదేవీలు, ఆయన సతీమణి, సన్నిహితుల లావాదేవీలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు.
లొంగిపోయేది లేదు
ఈడీ అధికారులు తన నివాసానికి చేరుకున్న తర్వాత సంజయ్ రౌత్ ఓ ట్వీట్ చేశారు. ఎన్ని విధాలుగా భయపెట్టినా తగ్గేదేలేదు అన్నారు.
Also Read: Removing Condom During Sex: సెక్స్ మధ్యలో కండోమ్ తీసేసినందుకు జైలు శిక్ష- కోర్టు సంచలన తీర్పు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 19 వేల కరోనా కేసులు- 39 మంది మృతి