Removing Condom During Sex: సెక్స్ మధ్యలో కండోమ్ తీసేసినందుకు జైలు శిక్ష- కోర్టు సంచలన తీర్పు

ABP Desam   |  Murali Krishna   |  31 Jul 2022 12:11 PM (IST)

Removing Condom During Sex: శృంగారం చేస్తోన్న సమయంలో భాగస్వామికి తెలియకుండా కండోమ్ తీసేయడం నేరమని ఆ దేశ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

(Image Source: Pixabay)

సెక్స్ చేస్తున్న సమయంలో తన అనుమతి లేకుండా కండోమ్ (condom) తీసేశాడని ఓ యువతి కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో విచారణ చేసిన కోర్టు.. సెక్స్ సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తీసేయడం ముమ్మూటికీ నేరమే అని తీర్పు ఇచ్చింది. ఈ సంచలన తీర్పు కెనడా సుప్రీం కోర్టు ఇచ్చింది.

ఇదీ జరిగింది

కెనడాకు చెందిన ఓ యువతికి ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తితో పరిచయం అయింది. వారిద్దరి మధ్య చాలాకాలం చాటింగ్ కొనసాగిన తర్వాత 2017లో డైరక్ట్‌గా కలుసుకున్నారు. అయితే సెక్స్‌కు సంబంధించి ఇద్దరి మధ్య ఓ ఒప్పందం జరిగింది. కండోమ్ లేకుండా శృంగారం చేయవద్దని వ్యక్తికి యువతి కండీషన్ పెట్టింది. దానికి అతను కూడా ఒప్పుకున్నాడు. కానీ సెక్స్ చేస్తోన్న సమయంలో అతను కండోమ్ తీసేశాడు. 

షాక్

కొన్ని రోజులు అంతా మామూలుగానే ఉంది. అయితే ఆ తర్వాత అతను హెచ్‌ఐవీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు యువతికి తెలిసింది. దీంతో ఫ్యూజులు ఎగిరిపోయాయి. అతనిపై కేసు పెట్టింది. అయితే కింది కోర్టులో తనకు న్యాయం జరుగలేదని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది యువతి.

అక్కడ యువతికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ముందుగా కండోమ్ గురించి ఇద్దరి మధ్య ఒప్పందం ఉన్నప్పటికీ తప్పు చేసినందుకు ఆ వ్యక్తికి శిక్ష విధించింది.

ఇష్టపూర్వకంగా సెక్స్ చేస్తున్నప్పటికీ కండోమ్ విషయంలో కూడా ఇరువురి సమ్మతి అవసరమే. సెక్స్ సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తీసేయడం ముమ్మూటికీ నేరమే.                                             -   కెనడా సుప్రీం కోర్టు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 19 వేల కరోనా కేసులు- 39 మంది మృతి

Also Read: Congress MLAs Arrest: సీక్రెట్‌గా భారీ నగదు తరలింపు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు

Published at: 31 Jul 2022 12:09 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.