ED Notices to Hemanth Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemanth Soren) కు ఎన్ ఫెర్స్ మెంట్ (ఈడీ) అధికారులు ఆరోసారి సమన్లు జారీ చేశారు.  రాజధాని రాంచీలో ఓ భూమి కొనుగోలు లావాదేవీలకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ (Enforcement) కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు తమ ముందుకు రావాల్సిందిగా వరుసగా ఆరోసారి సమన్లు పంపింది. ఈ క్రమంలో రాంచీలోని (Ranchi) జోనల్ కార్యాలయంలో సీఎం సోరెన్ మంగళవారం విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే కేసులో ఈడీ సీఎంకు ఐదుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే, దీనిపై సోరెన్ గతంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారంలో హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ కేసులో ఇప్పటి వరకూ ఈడీ 14 మందిని అరెస్ట్ చేసింది. వారిలో 2011వ బ్యాచ్ కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఉన్నారు. కాగా, అక్రమ మైనింగ్ వ్యవహారంలో సోరెన్ కు గతేడాది నవంబరులో ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.


Also Read: MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టు- లెక్కించడానికి 80 మంది సిబ్బంది