Special Train Between Kacheguda Kollam: అయ్యప్ప స్వాముల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక ట్రైన్లను వేస్తోంది. రద్దీని దృష్టిలో పెట్టుకొని వీటి సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది.
డిసెంబర్, జనవరి మాసంలో శబరిమల వెళ్లే భక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. స్వాములు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కాచిగూడ నుంచి ప్రత్యేక ట్రైన్స్ నడుపుతోంది.
ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 15 వరకు ఈ ప్రత్యేక టైన్స్ కాచిగూడ శబరిమల మధ్య నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. కాచిగూడ- కొల్లం మధ్య ఈ ట్రైన్స్ నడపనుంది.
ఏ ఏ తేదీల్లో ప్రత్యేక ట్రైన్ నడపనుంది
కాచిగూడ నుంచి డిసెంబర్ 18వ తేదీ, 25వ తేదీ, జనవరి 1, జనవరి 8, జనవరి 15 తేదీల్లో ఈ ట్రైన్ ప్రారంభంకానుంది.
కొల్లం నుంచి డిసెంబర్ 20, 27 జనవరి 3, 10, 17 తేదీల్లో బయల్దేరనుంది.
ఎప్పుడు బయల్దేరనుంది.
దక్షిణ మధ్య రైల్వే చెప్పిన తేదీల్లో రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కాచిగూడ స్టేషన్‌లో ఈ స్పెషల్ ట్రైన్ బయల్దేరనుంది. రెండు రోజుల తర్వాత ఉదయం 5.30 నిమిషాలకు చేరుకుంటుంది. అంటే 18వ తేదీన కాచిగూడలో బయల్దేరిన ట్రైన్ 20వ తేదీ ఉదయం ఐదున్నరకు కొల్లం స్టేషన్‌కు చేరుకుంటుంది.
అటు నుంచి వచ్చే ట్రైన్ కూడా ఉదయం 10.45 నిమిషాలకు కొల్లం స్టేషన్‌లో బయల్దేరనుంది. మూడో రోజు 3 గంటల 45 నిమిషాలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. అంటే 20వ తేదీ 10.45 నిమిషాలకు కొల్లంలో బయల్దేరితే 21వ తేదీ మధ్యాహ్నం 3.45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఏ ఏ స్టేషన్‌లలో ఆగుతుందంటే...
ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చెర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, శ్రీరాంనగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేటాయ్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాల్‌ఘాట్, థ్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగన్సేరీ, తిరువళ్ల, చెంగన్నూర్, మావేళికరా, కయ్యనకుళం స్టేషన్