Vote Fron anywhere : ఓటు వేయాలంటే... ఓటు హక్కు ఉన్న చోటకు వెళ్లి పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలి. అంతకు మించిన ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు ఈసీ ఎక్కడ ఉన్నా.. తమకు ఓటు ఉన్న చోట ఓటు వేసే అవకాశాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.  ఉపాధి నిమిత్తం దేశంలోని వివిధ నగరాలకు వెళ్లే వలస కార్మికులు అక్కడి నుంచే తమ సొంత నియోజకవర్గ అభ్యర్థికి ఓటు వేయడానికి రిమోట్‌ ఓటింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఈ  రిమోట్‌ ఆర్‌విఎం పనితీరును ప్రదర్శించేందుకున ఎనిమిది జాతీయ, 57 రాష్ట్ర రాజకీయ పార్టీలను ఆహ్వానించింది.  జనవరి 31లోగా వారి లిఖితపూర్వక అభిప్రాయాలను తెలియజేయాలని ఎన్నికల సంఘం  కోరింది. 


రిమోట్‌ ఓటింగ్‌ విధానం అమలు చేయడంలో ఎదుర్కొనే చట్టపరమైన, కార్యాచరణ, పరిపాలనా, సాంకేతిక సవాళ్లపై పార్టీల అభిప్రాయాలను పొందడం కోసం దీనిని ఎన్నికల సంఘం డిమాన్‌స్టేట్ చేయనుంది.  బహుళ నియోజకవర్గాల రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఆర్‌విఎం)ను అభివృద్ధి చేస్తునాుమని, దీనివల్ల ఒకే రిమోట్‌ పోలింగ్‌ బూత్‌ నుంచి బహుళ నియోజకవర్గాల ఓటర్లు వినియోగించుకునే అవకాశముందని తెలిపింది. రిమోట్‌ ఓటింగ్‌ను అమలు చేయడానికి 1950, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం, ది కండక్ట్‌ ఆఫ్‌ ఎలక్షన్‌ రూల్స్‌ 1961, ది రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎలక్టోర్స్‌ రూరల్స్‌ 1960లను సవరించాల్సి ఉందని ఈసీ పేర్కొంది. ఈ పరికరం దేశంలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా తమ నియోజకవర్గానికి ఓటు వేయడానికి వీలు కల్పిస్తుంది. 


2019 సార్వత్రిక ఎనిుకల్లో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది. 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరమని ఎన్నికల సంఘం భావిస్తోంది.   ఓటరు తన కొత్త నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలునాుయి. దీంతో చాలామంది ఎనిుకల్లో ఓటు వేయలేకపోతునాురు.  దేశంలోనే ఇతర రాష్ట్రాలకువలస వెళ్లినవారు.. ప్రయాణాలు చేయలేక  ఓటు వేయలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలామంది స్వస్థలాలను వదిలి వెళ్తునాురు. దేశంలో దాదాపు 85 శాతం మంది ఇలాంటి వారేనని అంచనా. 


ఇలా వలస వెళ్లినవారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఈ రిమోట్‌ ఓటింగ్‌పై దృష్టి పెట్టామని ఎన్నికల సంఘం చెబుతోంది.  వలస వెళ్తును వాళ్లలో 85 శాతం మంది సొంత రాష్ట్రంలోనే ఉంటున్నారు. ఇలాంటి వారికి సులభంగా ఓటు వేసే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఇసి రిమోట్‌ ఇవిఎంలను తీసుకొస్తోంది. దేశంలో వలసలకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. తాజాగా అభివృద్ధి చేసిన రిమోట్‌ ఇవిఎం.. ఒక్క దాంట్లోనే 72 నియోజకవర్గాలకు సంబంధించి ఓటు వేయొచ్చని ఈసీ చెబుతోంది. జనవరి 16వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 


రాజకీయాలంటే డైలాగులు, డ్రోన్‌ షాట్‌లు, డ్రామాలు కాదు - సీఎం జగన్