Regional Parties  Income  :  దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు 2020-21లో వచ్చిన విరాళాల్లో  28 శాతం తమిళనాడు అధికార పార్డీ డీఎంకే దక్కించుకుంది. 20 శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించాయి. ఆదాయ వివరాలను విశ్లేషించిన అసోసియేషన్ ఆప్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ.. నివేదికను వెల్లడించింది. ఈసీకి ఆయా పార్టీలు సమర్పించిన ఆదాయవ్యయాల ఆధారంగా దీనిని రూపొందించింది. అత్యధికంగా విరాళాలు అందుకున్న పార్టీల్లో మూడు దక్షిణాది పార్టీలు టాప్‌లో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీలు వైసీపీ, టీఆర్ఎస్‌తో పాటు తమిళనాడులోని డీఎంకే మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.  


వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్
   
 ఎన్నికల కమిషన్‌కు 31 ప్రాంతీయ పార్టీలు సమర్పించిన వివరాల ప్రకారం విరాళాల ద్వారా వారికి దాదాపు రూ. 530 కోట్ల ఆదాయం సమకూరింది.  అందుకో అత్యధికంగా డీఎంకేకు రూ. 150 కోట్ల విరాళం అందింది. ఇది మొత్తంలో 28 శాతం. తర్వాత స్థానంలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలిచింది. ఈ పార్టీకి ఇరవై శాతం అంటే రూ. 108 కోట్లు విరాళాలుగా వచ్చాయి. బీజేడీకి రూ. 73 కోట్లు, టీఆర్ఎస్ రూ.37.65 కోట్ల విరాళాలు వచ్చాయి. 


పురోహితునిగా ఎన్టీఆర్ - సినిమాలో కాదు నిజంగా !


గత రెండేళ్ల డేటాను విశ్లేషిస్తే అధికారంలో ఉన్న పార్టీలకు ఆదాయం పెరిగింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ఆదాయం తగ్గిపోయింది.  అయితే అధికారంలో ఉన్న పార్టీలకు ఖర్చు కూడా తక్కువగానే ఉంది. అసలు ఖర్చు చేయని పార్టీల్లో వైఎస్ఆర్‌సీపీ ముందు ఉంది.  ఏడాది మొత్తం మీద ఆ పార్టీ ఖర్చు చేసింది  కేవలం రూ.80 లక్షలు మాత్రమే . అయితే పొదుపు విషయంలో ఏపీ పార్టీ నెంబర్ వన్‌గా ఉంటే ఖర్చు విషయంలోనూ ఏపీ పార్టీనే మొదట్లో ఉంది. తెలుగుదేశం పార్టీకి టీడీపీకి విరాళాలు కేవలం రూ.3.25 కోట్లు రాగా.. ఆ పార్టీ రూ.54.76 కోట్లు ఖర్చు చేసింది. టీఆర్ఎస్‌కు రూ.37.65 కోట్ల ఆదాయం రాగా రూ.22.34 కోట్లు వెచ్చించింది.


నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
  
  31 పార్టీలకు  71 శాతం స్వచ్ఛంద విరాళాల రూపంలో అందాయి. వీటిలో రూ.250.60 కోట్లను ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో కూడగట్టుకున్నాయి. ఈ బాండ్ల మొత్తం కేవలం ఐదు పార్టీలకే వెళ్లింది. ఇందులో వైఎస్ఆర్సీపీ , డీఎంకే , బీజేడీ , ఆప్‌ , జేడీయూ ఉన్నాయి. ఇవన్నీ అధికార పార్టీలే