Diwali 2022: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ (Kargil) చేరుకున్నారు. భద్రతా సిబ్బందితో కలిసి మోదీ దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారు.
2014లో ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళ సిబ్బందితో కలిసి దీపావళి పండుగను మోదీ జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి పండగ సంబరాల్లో మోదీ పాల్గొంటున్నారు. గతేడాది జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సారి కార్గిల్‌లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
శుభాకాంక్షలు
అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
స్వీట్లు
సిలిగురి సమీపంలోని ఫుల్‌బారి వద్ద భారత్-బంగ్లాదేశ్ సైనికులు స్వీట్లు పంచుకున్నారు. సరిహద్దు వెంబడి మోహరించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 176 బెటాలియన్ సిబ్బంది దీపావళి సందర్భంగా బంగ్లాదేశ్ భద్రతా దళ సిబ్బందితో స్వీట్లు పంచుకున్నారు.