Digital Media Rules : టీవీ చానళ్లు పెట్టుకోవాలంటే పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుంది. అనుమతులు, లైసెన్స్ తీసుకోవాలి. కానీ అదే ఓ డిజిటల్ చానల్ అంటే యూట్యూబ్ చానల్ పెట్టుకోవాలంటే ఒక్క ఈ మెయిల్ ఉంటే చాలు. ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. అందులో అన్ని రకాల కంటెంట్ పోస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ డిజిటల్ న్యూస్ మీడియాకూ కొన్ని రూల్స్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.
మీ మొబైల్ మీరే రిపేర్ చేసుకోవచ్చు , రైట్ టు రిపేర్ అమలుకు కేంద్రం రెడీ!
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు
వచ్చే వారం నుండి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల్లో డిజిటల్ న్యూస్ నియంత్రణపై నూతన సవరణ చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించనున్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చట్టం ప్రకారం డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ డిజిటల్ సంస్థలపై అధికారాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ చట్టాన్ని ప్రధాని మోడీ కార్యాలయం, సంబంధిత వర్గాలు ఆమోదించాల్సి వుంది.
పిల్లలు 7 గంటలకే బడికి వెళ్లినప్పుడు- కోర్టు 9 గంటలకు ఎందుకు ప్రారంభం కాకూడదు?'
నిబంధనలు ఉల్లంగిస్తే జరిమానా - రిజిస్ట్రేషన్ రద్దు
ఈ చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన డిజిటల్‌న్యూస్ సంస్థపై జరిమానా విధించ వచ్చు లేదా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చు. దీంతో డిజిటల్ మీడియా సంస్థలన్నీ తప్పనిసరిగా నమోదు చేయించాల్సివుంటుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ డిజిటల్ మీడియాలో వార్తలను ప్రసారం చేసే ప్రెస్ మరియు పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లును సవరించే ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి కసరత్తు దాదాపుగా పూర్తయిందని... త్వరలో ప్రధాని కార్యాలయానికి పంపే అవకాశం ఉందని చెబుతున్నారు.
మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లొద్దు సర్! టీచర్‌కు పిల్లలు ఎలా ఫేర్‌వెల్ ఇచ్చారో చూడండి
గతంలో చట్ట సవరణకు ప్రయత్నం విఫలం - ఇప్పుడు ఖాయం
నిజానికి ఇలాంటి ప్రక్రియను తొలి సారి 2019లోనే చేపట్టారు. కానీ అప్పట్లో ఈ అంశం వివాదాస్పదమయింది. చివరికి ఎలాంటి చట్టం చేయకుండానే కేంద్రం ఆగిపోయింది. అయితే ఈ సారి మాత్రం చట్టం చేయడం ఖాయమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ న్యూస్ పేరుతో ఫేక్ న్యూస్ విపరీతంగా ప్రచారం చేస్తున్నారని నియంత్రించాని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.