First DNPA Dialogue: 


బార్గెయినింగ్ కోడ్‌పై ప్రస్తావన..


డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) సమావేశంలో నిపుణులు డిజిటల్ పబ్లిషింగ్‌కు సంబంధించి ఎన్నో ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకున్నారు. పలు దేశాలకు చెందిన మీడియా సంస్థల ప్రతినిధులతో ఆస్ట్రేలియాకు చెందిన ఎక్స్‌పర్ట్స్ కొందరు...టెక్ సంస్థలకు, న్యూస్ పబ్లిషర్స్‌కి మధ్య ఉన్న అంతరాలను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించారు. ఈ సందర్భంగా భారత్‌లోని న్యూస్ పబ్లిషర్స్‌ సంస్థల గురించీ ప్రస్తావన వచ్చింది. డిజిటల్ న్యూస్ ఇండస్ట్రీకి, టెక్ దిగ్గజాలైన ఫేస్‌బుక్, గూగుల్‌కు మధ్య ఉన్న భాగస్వామ్యం గురించి ఇప్పటి వరకూ ఎలాంటి చర్చ జరగలేదు. ఇన్నాళ్లకు తొలిసారి ఆన్‌లైన్‌ వేదికగా ఈ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి Australian Competition and Consumer Commission (ACCC) మాజీ హెడ్ రాడ్ సిమ్స్ నేతృత్వం వహించారు. టెక్ దిగ్గజ సంస్థలకు, మీడియాకు మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా మధ్యవర్తిత్వ వ్యవస్థ అందుబాటులోకి రావాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి భారత్‌కు చెందిన డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్‌ ప్రతినిధులు కీలక అంశాలు ప్రస్తావించారు. 


ఆస్ట్రేలియా, కెనడాలో న్యూస్ మీడియా దిగ్గజ టెక్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే సమయంలో The News Media Bargaining Codeను అనుసరిస్తాయి. టెక్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌పై న్యూస్‌ని పబ్లిష్ చేసేందుకు లోకల్ న్యూస్ పబ్లిషర్స్‌కి డబ్బు చెల్లిస్తాయి. భారత్‌లోనూ ఇలాంటి విధానమే అందుబాటులోకి రావాలని ఈ కాన్ఫరెన్స్ హెడ్ రాడ్ సిమ్స్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భారత్‌ తరపున పాల్గొన్న ప్రతినిధులు అందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో గతేడాదే ఇది అందుబాటులోకి వచ్చిందని, చట్టప్రకారం ఈ బార్గెయినింగ్‌ కోడ్స్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. 


కూర్చుని మాట్లాడుకోవాలి..


టెక్‌ ప్లాట్‌ఫామ్స్, న్యూస్ పబ్లిషర్స్‌ సానుకూల వాతావరణంలో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని నిపుణులు సూచించారు. తమ ప్లాట్‌ఫామ్స్‌పై న్యూస్ పబ్లిష్‌ చేస్తున్న సంస్థలకు టెక్ కంపెనీలు సరైన మొత్తంలో డబ్బు చెల్లించాలని అన్నారు. "గూగుల్, ఫేస్‌బుక్‌ గతంలో కొన్ని మీడియా కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నాయి. ఇప్పుడీ సంస్థలు ఆ డీల్స్ ఎందుకు కుదుర్చుకున్నామా అని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. చట్టప్రకారం ఓ వ్యవస్థ ఏర్పాటైతే కానీ..టెక్ కంపెనీలతో కుదిరిన ఒప్పందం సరైందా కాదా..? కంటెంట్‌కి ఎంత కంపెన్సేషన్ రావాలి..? అనే విషయాల్లో స్పష్టత రాదు. చట్ట ప్రకారం జరిగితే...రెండు వైపులా ఓ సానుకూల వాతావరణంలో ఒప్పందాలు కుదురుతాయి. ఆ భాగస్వామ్యం ఆరోగ్యకరంగా కొనసాగుతుంది" అని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా న్యూస్ మీడియా బార్గెయినింగ్ కోడ్ గురించి ఎన్నో వివరాలు తెలిపారు రాడ్ సిమ్స్. ఈ చట్టం వచ్చాక..ఆస్ట్రేలియాలో సత్ఫలితాలు వచ్చాయని  చెప్పారు. మీడియాతో పాటు అన్ని పార్టీలు ఈ చట్టాన్ని ఆమోదించా ల్సిన అవసరముంది అన్నారు. ఆస్ట్రేలియాలో క్వాలిటీ జర్నలిజాన్ని ప్రజలకు పరిచయం చేయడంలో ఈ బార్గెయినింగ్ కోడ్ కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేశారు..The Australia Institute డైరెక్టర్ పీటర్ లూయిస్.


ప్రస్తుతం ఆస్ట్రేలియా మీడియాలో "క్వాలిటీ" పెరగడంతో పాటు నియామకాలు కూడా పెరిగాయని చెప్పారు. టెక్ ప్లాట్‌ఫామ్స్, డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్‌ మధ్య పారదర్శకమైన ఒప్పందాలు కుదర్చడంలో అన్ని సంస్థలూ చొరవ చూపాలని సూచించారు. సెకండ్ ఎడిషన్ సమావేశాన్ని డిసెంబర్ 9న నిర్వహించనున్నారు. Digital News Publishers Association (DNPA) అనేది డిజిటల్ మీడియా  సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన సంస్థ. న్యూస్ పబ్లిషింగ్‌లో పారదర్శకతను పెంచేందుకు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తోంది. ఈ అసోసియేషన్‌లోదైనిక్ జాగరణ్, దైనిక్ భాస్కర్, ఈటీవీ, ABP Network,ఇండియా టుడే గ్రూప్ తదితర సంస్థలు సహా మొత్తం 17 మీడియా పబ్లిషింగ్సం స్థలున్నాయి.


Also Read: Gujarat Elections: రాముడి పేరు చెప్పుకుని బీజేపీ మార్కెటింగ్ చేసుకుంటుంది - గుజరాత్ మాజీ సీఎం శంకర్ సిన్హ్