Delhi: దిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడ్ని కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి చంపేశారు. అయితే అక్కడ చుట్టూ ఉన్న జనం కనీసం స్పందించకపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.
ఇదీ జరిగింది
శనివారం సాయంత్రం సుందర్ నగరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమచాారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
స్పందించని జనం
బాధితుడ్ని కత్తులతో పొడుస్తోన్న సమయంలో ఆ పక్కనే కొంత మంది కూర్చుని ఉన్నారు. ఒకతను కూర్చీలో కూర్చొని ఉండగా, మరొక వ్యక్తి బైక్‌పై కూర్చొని ఉన్నాడు. ఇంత జరుగుతున్నా వారిలో కనీసం చలనం కూడా లేదు. అలాగే చూస్తూ ఉండిపోయారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అలామ్, బిలాల్, ఫైజాన్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇందుకే హత్య
బాధితుడు సుందర్ నగరికి చెందిన మనీశ్‌గా పోలీసులు గుర్తించారు. పాత పగలతోనే యువకుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడి బంధువులు, స్థానికులు.. ఆదివారం భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు.
Also Read: Rahul Gandhi on Gandhi Jayanti: మహాత్ముడి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ శపథం!
Also Read: Gandhi Jayanti 2022: మహాత్మా గాంధీ, శాస్త్రిలకు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల నివాళులు