BCCI naming AI robot dog Champak: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 అందర్నీ AI రోబోట్ కుక్కకు ఆకట్టుకుంటోంది. దానికి 'చంపక్' అని పేరు పెట్టింది బీసీసీఐ. ఈ పేరు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టు BCCI కి నోటీసు జారీ చేసింది. AI రోబోట్ కుక్కకు 'చంపక్' అని పేరు పెట్టడం ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన అవుతుందని పేర్కొంటూ పిల్లల పత్రిక చంపక్ ఒక పిటిషన్ దాఖలు చేసింది.
చంపక్ మ్యాగజైన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు BCCI స్పందించాలని కోరింది. నాలుగు వారాల్లోగా రాతపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ విషయంపై తదుపరి విచారణ జూలై 9కి విడుదల చేశారు.
ఐపిఎల్ లో ప్రవేశపెట్టినప్పటి నుండి రోబోట్ డాగ్ చంపక్ అన్ని ఐపిఎల్ మ్యాచ్‌లకు ఆకర్షణీయంగా మారింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 29వ మ్యాచ్‌కు ముందు టాస్‌లో దీనిని అధికారికంగా ఆవిష్కరించారు.
అప్పటి నుండి, ఆటగాళ్ళు తమ ప్రాక్టీస్ సెషన్‌లలో రోబోట్ డాగ్‌తో సరదాగా గడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇది వారి ప్రీ-గేమ్ రొటీన్‌కు తగ్గట్లుగా వ్యవహరిస్తోంది. రోబోటిక్ డాగ్ కు పేరు పెట్టడానికి ఒక పోల్‌ను కూడా నిర్వహించారు . అభిమానుల నుండి 'చంపక్' అనే పేరుకు అత్యధిక ఓట్లు వచ్చాయి. అందుకే ఆ పేరు ఖరారు చేశారు. ఇప్పుడీ పేరు వివాదంలో ఇరుక్కుంది.
చంపక్ అనేది మ్యాగజైన్ పెట్ిటనపేరు కాదని.. ఓ వస్తువుకు పెట్టిన పేరు అని బీసీసీఐ కోర్టులో వాదించే అవకాశం ఉంది.