వివాహ బంధంతో ఒక్కటైన స్త్రీ,పురుషులకు... వివాహం చేసుకోకుండా సహజీవనం చేసే వారి మధ్య ఓ గుణాత్మక వ్యత్యాసం ఉందని దిల్లీ హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని దాఖలైన అమికస్ క్యూరీ కింద దాఖలైన పిటిషన్లపై దిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ తో దిల్లీ హైకోర్టులోని న్యాయమూర్తులు జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ సి.హరిశంకర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ "వివాహ బంధంలో ఇరువైపుల నుంచి లైంగిక సంబంధాలను ఆశించే హక్కు ఉంటుంది. వివాహం చేసుకోనప్పుడు ఇటువంటి హక్కు ఉండదు" అని వ్యాఖ్యాంచారు. 


న్యాయవాది జాన్ వాదనాల్లో భార్య అంగీకారంపై ఇచ్చిన వివరణపై న్యాయమూర్తి శంకర్ స్పందించారు. ఐపీసీ 375 సెక్షన్ లో ఉన్న భర్తలకు ఉన్న మినహాయింపును సమర్థించడానికి పార్లమెంటు ఒక రకమైన హేతుబద్ధమైన ఆధారాన్ని అందించిందని శంకర్ చెప్పాడు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 375లో ఉన్న మినహాయింపులో పదిహేనేళ్ల వయసు పైబడిన తన సొంత భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారం కాదని పేర్కొంది. 


Also Read: హైదరాబాద్‌లో మరో అద్భుతం.. మాస్కో తరహాలో హుస్సేన్ సాగర్‌పై త్వరలోనే వేలాడే వంతెన


"మేము ఈ కేసు విచారణలో మహిళ అంగీకారంపై దృష్టిపెట్టాం. పార్లమెంట్ చేసిన చట్టంలో రాజ్యాంగబద్ధత ఉందని ఈ విషయాన్ని సులభంగా తిరస్కరించలేమన్నారు. ప్రత్యేకించి క్రిమినల్ కేసులో చట్టంలో ఉన్న నిబంధన మేరకు చేసిన నేరాన్ని తేలికగా కొట్టివేయలేం' అని శంకర్ అన్నారు. ఇలాంటి సున్నితమైన కేసుల్లో ప్రత్యామ్నాయం ఉందా లేక పార్లమెంటు ఇచ్చిన ప్రాథమిక హేతుబద్ధమైన ఆధారం చట్టపరమైన నిబంధనను రద్దు చేయడానికి అవకాశం ఉందా అని ఆయన అన్నారు. ఈ విషయంపై మొదటి రోజు నుంచి తనకు సమాధానం దొరకడం లేదని ఆయన అన్నారు. ఒక నిబంధనను రద్దు చేయడానికి మార్గాలను కనుగొనవలసిన అవసరం లేదని అని న్యాయమూర్తి శంకర్ రెబెక్కా జాన్‌తో చెప్పారు. 


వైవాహిక, వివాహేతర సంబంధానికి మధ్య వ్యత్యాసం ఉందని న్యాయమూర్తి శంకర్ అన్నారు. ఒక వ్యక్తి వివాహం చేసుకోనప్పుడు మహిళతో లైంగిక సంబంధాలపై హక్కు ఉండదన్నారు. కానీ వారి మధ్య వైవాహిక బంధం ఏర్పడితే అతను భాగస్వామితో సహేతుకమైన లైంగిక సంబంధాలను ఆశించవచ్చని న్యాయమూర్తి జస్టిస్ శంకర్ అన్నారు. 


Also Read: కరోనా పెళ్లిళ్లలో జొమాటో విందులే కాదు.. "ఒక్క కర్రీ" భోజనాలు కూడా ఉంటాయ్ ! వేములవాడలో వీళ్లు తీసుకున్న నిర్ణయం ఇదీ