సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి మాతృమూర్తి కల్పకం ఏచూరి(89) మృతి చెందారు. ఆమె మృతి పట్ల సీతారాం ఏచూరి కుటుంబానికి సీపీఎం పార్టీ సంతాపం తెలిపింది. మరణాంతరం మృత దేహాన్ని మెడికల్ రీసర్చ్ కు ఇవ్వాలని ఆమె కోరుకున్నారు. దీంతో ఆమె పార్థివ దేహాన్ని మెడికల్ రీసర్చ్ కు అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

  


Also Read: 13 జిల్లాల జడ్పీ ఛైర్మన్లు వీరే... పూర్తైన ప్రమాణ స్వీకారాలు... అన్ని జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక






స్వచ్ఛంద సేవలు


మహిళల సాధికారతే లక్ష్యంగా, వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేసిన స్ఫూర్తి ప్రదాత కల్పకం ఏచూరి. కల్పకం ఏచూరి 1933 జూన్ 6న మద్రాసులో జన్మించారు. బాల్యం నుంచే సామాజిక కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ అంటే కల్పకం ఏచూరికి ఎంతో అభిమానం. బాల్యంలో దుర్గాబాయి ఏర్పాటు చేసిన బాలికాసేనలో సభ్యురాలిగా ఎన్నో కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఆమెకు బాల్యంలోనే ఏచూరి సర్వేశ్వర సోమయాజులుతో వివాహం జరిగింది. మధ్యలో ఆగిపోయిన చదువును పెళ్లి తర్వాత ఆమె కొనసాగించారు. ఆమె మద్రాసు క్వీన్ మేరీస్ కాలేజీలో చదివారు. మహిళల విద్యావకాశాలను పెంపొందించడంతో తల్లితో పాటు దుర్గాబాయి స్థాపించిన ఆంధ్ర మహిళా సభకు వెళ్లి స్వచ్ఛంద సేవలు చేసేవారు. 


Also Read: త్వరలో ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు.. మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు


మహిళల సాధికారత కోసం


మద్రాసు స్టెల్లా మేరీస్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చేశారు. బెనారస్ హిందూ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్శిటీలో ఇండియా అండ్ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఎం.ఫిల్ చేశారు. ఎఐడబ్ల్యుసితో ఆమెకు ఆరు దశాబ్దాల అనుబంధం ఉంది. బయోగ్యాస్, పొగలేని చుల్హా ప్రాజెక్టులు,ఇంధన సంరక్షణ, ప్లాస్టిక్ రీ సైక్లింగ్, మూలికా తోటపని, గ్రామీణ శక్తి మహిళ సాధికారత, యూనిఫెమ్ సహాకారంతో  ప్రాజెక్టు మేనేజర్స్ శిక్షణ వంటి అనేక శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహించారు. 


Also Read: భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు - బస్సులు నిలిపివేయాలని నిర్ణయం!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి