దేశంలో అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తోందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ప్రధాని కార్యాలయానికి నిపుణుల కమిటీ నివేదిక పంపింది. ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చాయి. వీటి ఉద్ధృతితో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు భారత్ కు కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని పేర్కొంది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుల కమిటీ కేంద్రాన్ని హెచ్చరించింది.
Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!
పిల్లలపై ప్రభావం
కరోనా థర్ద్ వేవ్ తో పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణుల కమిటీ హెచ్చరికలు జారీచేసింది. వైద్య పరంగా సంసిద్ధతంగా ఉండాలని కేంద్రానికి సూచనలు చేసింది. పిల్లలకు వైద్య సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు, వైద్య పరికరాలు అవసరమైన స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని నివేదికలో పేర్కొంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 82% శిశువైద్యుల కొరత ఉందన్న కమిటీ... కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63% ఖాళీలు ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన డేటాపై ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, తగినంత వైద్య సదుపాయాలు, వ్యాక్సినేషన్ ఆలస్యం కావడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చని కేంద్రానికి నివేదికలు పంపంది.
దేశంలో కొత్తగా 25 వేల కేసులు
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం.... కొత్త కేసులు 19 శాతం మేర తగ్గాయి. కొత్తగా 25072 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య సుమారు ఐదు నెలల కాలంలో కనిష్ఠానికి తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 25,072 మంది కరోనా బారిన పడ్డారు. 389 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసులు 3.24 కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు దేశంలో 4,34,756 మంది మృతి చెందారు. ఆదివారం 44,157 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.16 కోట్లకు చేరాయి. కొద్ది రోజులుగా యాక్టివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,33,924 మంది కరోనాతో బాధపడుతున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 7,95,543 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు పంపిణీ అయిన కరోనా డోసుల సంఖ్య 58.25 కోట్లకు చేరింది.