Nasal Vaccine: 


నిపుణుల వివరణ..


మరోసారి కరోనా కలవరం మొదలైన నేపథ్యంలో...వ్యాక్సిన్‌ల గురించే చర్చ జరుగుతోంది. పాత వ్యాక్సిన్‌లు కొత్త వేరియంట్‌ను అడ్డుకుంటాయా..? మళ్లీ వేరే వ్యాక్సిన్ తీసుకోవాలా..? అన్న ప్రశ్నలూ తెరపైకి వస్తున్నాయి.  ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ సరికొత్త నాసల్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో 18 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకాలు అందించవచ్చని DCGI ఆమోదం కూడా తెలిపింది. అయితే....ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వాళ్లు కూడా ఈ టీకా తీసుకోవాలా..? ప్రికాషనరీ డోస్ తీసుకుంటే సరిపోతుందా అన్న సందిగ్ధంలో ఉన్నారు చాలా మంది. కొంత మంది నిపుణులు దీనిపై స్పష్టతనిచ్చారు. నాసల్ వ్యాక్సిన్‌ను "ఫస్ట్ బూస్టర్" అని తేల్చి చెప్పారు. అంటే...ఇప్పటి వరకూ బూస్టర్ డోస్ తీసుకోని వాళ్లు ఈ నాసల్ వ్యాక్సిన్‌ను బూస్టర్‌ డోస్‌గా తీసుకోవచ్చు. కానీ...ప్రికాషనరీ డోస్‌ తీసుకున్న వాళ్లకు మాత్రం నాసల్ వ్యాక్సిన్‌తో పని లేదు. "నాసల్ వ్యాక్సిన్‌ను మేం ఫస్ట్ బూస్టర్ డోస్‌గా రికమెండ్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రికాషనరీ డోస్ తీసుకున్న వాళ్లు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్లు నాసల్ వ్యాక్సిన్‌ తీసుకోనక్కర్లేదు. కేవలం ప్రికాషన్ డోస్ తీసుకోని వాళ్లకు మాత్రం నాసల్ వ్యాక్సిన్‌ తీసుకుంటే మంచిది" అని ఓ వైద్య నిపుణుడు వెల్లడించారు. 


ఎలా పని చేస్తుంది..? 


భారత్ బయోటెక్ తయారు చేసిన iNCOVACC నాసల్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి అందించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని బూస్టర్‌డోస్‌గా ఇస్తారు. అయితే...ఈ టీకాను ఎలా ఇస్తారు..? కరోనాపై ఎంత సమర్థంగా పని చేస్తుంది..?  కరోనా కట్టడిలో ఎలా ఉపయోగ పడుతుంది..? అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఓ సారి వీటి గురించి వివరంగా చర్చిద్దాం. భారత్ బయోటెక్ తయారు చేసిన iNCOVACC నాసల్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి అందించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని బూస్టర్‌డోస్‌గా ఇస్తారు. అయితే...ఈ టీకాను ఎలా ఇస్తారు..? కరోనాపై ఎంత సమర్థంగా పని చేస్తుంది..? కరోనా కట్టడిలో ఎలా ఉపయోగపడుతుంది..? అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఓ సారి వీటి గురించి వివరంగా చర్చిద్దాం. సాధారణంగా వ్యాక్సిన్ అనగానే మనకు సిరంజీ గుర్తుకొస్తుంది. వయల్ నుంచి మందు తీసి నీడిల్‌తో మన శరీరంలోకి ఎక్కిస్తారు. ఫలితంగా.. .అది కరోనాపై పోరాటం చేసి కట్టడి చేస్తుంది. కానీ...నాసల్ వ్యాక్సిన్ తీరు వేరు. నేరుగా ముక్కులో చుక్కల 
ద్వారా అందిస్తారు. కరోనా వైరస్ ముక్కులో ఎక్కువ కాలం పాటు నివసిస్తుందన్న పరిశోధనలు ఆధారంగా చేసుకుని ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. ఈ చుక్కలను ముక్కు ద్వారా అందిచడం వల్ల వైరస్‌పై చాలా సమర్థంగా పని చేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. మూడు సార్లు ట్రయల్స్ నిర్వహించాక కానీ...ఈ నాసల్ వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేయలేదు. మూడు ట్రయల్స్‌లోనూ ఈ టీకా చాలా సమర్థంగా పని చేసినట్టు తేలింది. 


Also Read: Tamil Nadu Covid Cases: తమిళనాడుకు వచ్చేసింది- చైనా నుంచి వచ్చిన తల్లీబిడ్డలకు కరోనా!