కరోనా కొత్త వేరియంట్‌పై ఢిల్లీ ఎయిమ్స్‌ గైడ్‌లెన్స్, నిర్లక్ష్యం చేయొద్దని వార్నింగ్

Covid Cases in India: కరోనా కొత్త వేరియంట్‌పై ఢిల్లీ ఎయిమ్స్‌ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.

Continues below advertisement

Corona Cases in India: 

Continues below advertisement

ఢిల్లీలో తొలి కేసు..

దేశవ్యాప్తంగా JN.1 వేరియంట్ కేసులు (Covid-19 Cases in India) క్రమంగా పెరుగుతున్నాయి. గుజరాత్‌లో అత్యధికంగా 36 కేసులు నమోదయ్యాయి. మొత్తం 7 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ఢిల్లీలోనూ తొలికేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఢిల్లీ AIIMS అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి కొన్ని మార్గదర్శకాలు (AIIMS Guidelines) జారీ చేసింది. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కి వస్తున్న బాధితులను స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన వాళ్ల కోసం ప్రత్యేకంగా 12 పడకలు సిద్ధం చేసింది. Severe Acute Respiratory Infection (SARI) లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్లకు పరీక్షలు నిర్వహించనుంది. దగ్గు, జ్వరం ఉన్న వాళ్లు నిర్లక్ష్యం చేయకూడదని సూచించింది. వీళ్లందరికీ కొవిడ్ టెస్ట్‌లు చేయనున్నారు. 

మార్గదర్శకాలివే..

1. ఎయిమ్స్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్‌లలోని వార్డులలో కొవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. 

2. ఓ వార్డులో ప్రత్యేకంగా 12 పడకలు సిద్ధం చేయాలి. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ఇక్కడే చికిత్స అందించాలి. 

3. ఓపీ డిపార్ట్‌మెంట్‌లో కొవిడ్‌ తరహా లక్షణాలతో బాధ పడుతున్న వాళ్లకి తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయాలి. 

4. వీలైనంత త్వరగా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఫిల్టర్‌లు ఏర్పాటు చేయాలి. 

డిసెంబర్ 27వ తేదీన JN.1వేరియంట్ తొలికేసు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు. ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ అయిన JN.1 సోకినా స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, సౌత్ ఇండియాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ఇప్పటి వరకూ ఢిల్లీలో 35 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 

ఇప్పటికే రకరకాల వ్యాధులతో సతమతం అవుతున్న వారికి ఈ వైరస్ చాలా వేగంగా సోకుతోందని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా JN.1 వేరియంట్ 7 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందిందని స్పష్టం చేశారు. కర్ణాటక, గోవా, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడులో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని...ఇక క్రిస్మస్‌, న్యూ ఇయర్ వేడుకల కారణంగా ఇది మరింత పెరిగే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే వచ్చే ఏడాది మొదటి రెండు వారాల్లోనే కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశముంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

Also Read: Putin Wishes PM Modi: నా మిత్రుడు మరోసారి గెలవాలి,ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ విషెస్

Continues below advertisement