పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం దిశగా పయనిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఘన విజయం సాధించినా కంగారులు... రెండో టెస్ట్‌లోనూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 318 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (63) హాఫ్ సెంచరీ చేశాడు. ఉస్మాన్ ఖవాజా (42), మిచెల్ మార్ష్ (41), డేవిడ్ వార్నర్ (38) లు రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లు పడగొట్టాడు, షాహీన్ అఫ్రీది, మీర్ హంజా, హసన్ అలీ లు తలా రెండు వికెట్లు తీశారు. అగా సల్మాన్ ఓ వికెట్ సాధించాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (29), అమీర్ జమాల్ (2)లు క్రీజులో ఉన్నారు. అబ్దుల్లా షఫీక్ (62), షాన్ మసూద్ (54)లు అర్ధశతకాలతో రాణించారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు పాకిస్తాన్ ఇంకా 124 పరుగుల దూరంలో ఉంది. ఆరంభంలో పాక్ మెరుగ్గా కనిపించినప్పటికీ. కమిన్స్ సూపర్ బౌలింగ్‌తో పాక్‌ను దెబ్బతీశాడు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా, నాథన్ లయన్ రెండు, జోష్ హేజిల్‌వుడ్ లు ఓ వికెట్ పడగొట్టాడు.
పాక్ ఖాతాలో చెత్త రికార్డు
టెస్టు క్రికెట్‌లో పాకిస్తాన్ జట్టు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 52 పరుగులను ఎక్స్‌ట్రా ల రూపంలో ఇచ్చింది. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జట్టుగా పాక్ అపఖ్యాతి మూటగట్టుకుంది. ఎక్స్‌ట్రాస్‌లో 15 వైడ్‌లు, 20 బైలు, 2 నోబాల్స్ ఉన్నాయి. 1995 నుంచి పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవలేదు. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో టెస్టు మ్యాచులో సైతం ఆస్ట్రేలియా క్రమంగా పట్టు బిగిస్తోంది.
తొలి టెస్ట్‌లో ఘన విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్‌కు ఐసీసీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 233 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన ఆసీస్.. పాకిస్తాన్ ఎదుట 449 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. 450 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ 89 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ కేవలం 271 పరుగులకే పరిమితమైంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి డిక్లేర్ చేసి 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది.